Priyanshu : ప్రియాన్షు.. కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌

ABN , First Publish Date - 2023-04-12T02:24:28+05:30 IST

గతవారం ఓర్లీన్స్‌ మాస్టర్స్‌ టోర్నమెంట్‌ విజయంతో కెరీర్‌లో తొలి వరల్డ్‌ టూర్‌ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్న భారత యువ షట్లర్‌ ప్రియాన్షు రజావత్‌.. బీడబ్ల్యూఎఫ్‌ తాజా ర్యాంకింగ్స్‌లో

 Priyanshu : ప్రియాన్షు.. కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌

న్యూఢిల్లీ: గతవారం ఓర్లీన్స్‌ మాస్టర్స్‌ టోర్నమెంట్‌ విజయంతో కెరీర్‌లో తొలి వరల్డ్‌ టూర్‌ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్న భారత యువ షట్లర్‌ ప్రియాన్షు రజావత్‌.. బీడబ్ల్యూఎఫ్‌ తాజా ర్యాంకింగ్స్‌లో దూసుకె ళ్లాడు. మంగళవారం విడుదలైన ర్యాంకింగ్స్‌లో ప్రియాన్షు 20 స్థానాలు ఎగబాకి 38వ ర్యాంక్‌ను అందుకున్నాడు. 21 ఏళ్ల ప్రియాన్షుకిదే కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌. కిడాంబి శ్రీకాంత్‌ 23వ, లక్ష్యసేన్‌ 24వ స్థానంలో ఉండగా, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 8వ ర్యాంక్‌తో టాప్‌-10లో కొనసాగుతున్నాడు. సింధు 11వ ర్యాంక్‌కు చేరగా, సైనా 31వ ర్యాంక్‌లో ఉన్నారు.

Updated Date - 2023-04-12T02:24:29+05:30 IST