అంతిమ్‌కు కాంస్యం.. ఒలింపిక్ బెర్త్
ABN , First Publish Date - 2023-09-22T03:09:47+05:30 IST
వరల్డ్ చాంపియన్‌షిప్‌లో టీనేజ్ రెజ్లర్ అంతిమ్ పంగల్ కాంస్యంతో మెరిసింది. అంతేగాకుండా 53 కిలోల విభాగంలో దేశానికి పారిస్ ఒలింపిక్ బెర్త్‌ను అందించింది. గురువారం జరిగిన కాంస్య పోరులో అంతిమ్ 16-6తో
బెల్‌గ్రేడ్ (సెర్బియా): వరల్డ్ చాంపియన్‌షిప్‌లో టీనేజ్ రెజ్లర్ అంతిమ్ పంగల్ కాంస్యంతో మెరిసింది. అంతేగాకుండా 53 కిలోల విభాగంలో దేశానికి పారిస్ ఒలింపిక్ బెర్త్‌ను అందించింది. గురువారం జరిగిన కాంస్య పోరులో అంతిమ్ 16-6తో మల్మ్‌గ్రెన్ (స్వీడన్)ను చిత్తు చేసింది. ఈ మెగా ఈవెంట్‌లో కంచు పతకం సాధించిన ఆరో భారత మహిళా రెజ్లర్‌గా అంతిమ్ నిలిచింది. కాగా, గ్రీకో-రోమన్ 82 కిలోల తొలి రౌండ్‌లో సజన్ భన్వల్ 1-3తో యాంగ్ సీజిన్ (కొరియా) చేతిలో, 77 కిలోల ప్రీక్వార్టర్స్‌లో గుర్‌ప్రీత్ సింగ్ 0-4తో లీవియా జోల్డాన్ (హంగేరి) చేతిలో, 130 కిలోల క్వాలిఫికేషన్ రౌండ్‌లో మెహర్ సింగ్ 0-8తో డేవిడ్ ఒవసపియన్ (ఆర్మేనియా) చేతిలో చిత్తయ్యారు.