మంజీత్‌కు కాంస్యం

ABN , First Publish Date - 2023-06-02T04:00:04+05:30 IST

యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్‌ సిరీ్‌సలో మంజీత్‌ కాంస్య పతకం సాధించాడు. గురువారం జరిగిన 55 కిలోల విభాగం కాంస్య పోరులో మంజీత్‌ 14-9తో యర్సిన్‌ అబియర్‌ (కజకిస్థాన్‌)పై గెలిచాడు.

మంజీత్‌కు కాంస్యం

యూడబ్ల్యూడబ్ల్యూ ర్యాంకింగ్‌ సిరీస్‌

బిష్కెక్‌ (కిర్గిస్థాన్‌): యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్‌ సిరీ్‌సలో మంజీత్‌ కాంస్య పతకం సాధించాడు. గురువారం జరిగిన 55 కిలోల విభాగం కాంస్య పోరులో మంజీత్‌ 14-9తో యర్సిన్‌ అబియర్‌ (కజకిస్థాన్‌)పై గెలిచాడు. అంతకుముందు క్వార్టర్స్‌లో మంజీత్‌ 4-13తో ఇకితియోర్‌ బొటిరోవ్‌ (ఉజ్బెకిస్థాన్‌) చేతిలో ఓడాడు. అయితే, బొటిరోవ్‌ ఫైనల్‌ చేరడం తో మంజీత్‌కు రెపిచేజ్‌ ఆడే అవకాశం దక్కింది. 60 కిలోల కేటగిరీ రేపిచేజ్‌ రౌండ్‌లో సుమీత్‌, 67 కిలోల్లో నీరజ్‌ పరాజయం పాలయ్యారు. సునీల్‌ కుమార్‌ (87 కి), నరీందర్‌ చీమా (97 కి), సాహిల్‌ (130 కి)లు క్వాలిఫికేషన్‌ దశలోనే నిష్క్రమించారు.

Updated Date - 2023-06-02T04:00:04+05:30 IST