Bangladesh: బంగ్లా భారీ గెలుపు
ABN , First Publish Date - 2023-03-19T00:43:12+05:30 IST
ఐర్లాండ్‌తో తొలి వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్ 183 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.

సిల్హట్: ఐర్లాండ్‌తో తొలి వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్ 183 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 338 పరుగుల భారీస్కోరు చేసింది. వన్డేల్లో బంగ్లాకిదే అత్యధిక స్కోరు. అంతేకాదు.. ఆ జట్టుకిది భారీ గెలుపు కూడా. షకీబల్ (93), తౌహిద్ హ్రిదోయ్ (92) అర్ధ శతకాలతో రాణించారు. గ్రాహమ్ హ్యూమ్స్ 4 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో ఐర్లాండ్ 30.5 ఓవర్లలో 155 పరుగులకే కుప్పకూలింది. డాక్రెల్ (45), స్టీఫెన్ డోహ్ని (34) టాప్ స్కోరర్లు. ఇబాదత్ 4, నసుమ్ అహ్మద్ 3 వికెట్లు తీశారు. కాగా, వన్డేల్లో ఏడు వేల పరుగులు, మూడొందల వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా షకీబల్ నిలిచాడు. జయసూర్య, అఫ్రీది ముందే ఈ ఫీట్‌ను అందుకొన్నారు.