తుది జట్టులో భరత్‌కే చాన్స్‌

ABN , First Publish Date - 2023-05-26T04:39:47+05:30 IST

వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో వికెట్‌ కీపర్‌గా కేఎస్‌ భరత్‌కు చోటు కల్పించే అవకాశాలు ఎ క్కువగా ఉన్నాయని టీ మిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు.

తుది జట్టులో భరత్‌కే చాన్స్‌

దుబాయ్‌: వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో వికెట్‌ కీపర్‌గా కేఎస్‌ భరత్‌కు చోటు కల్పించే అవకాశాలు ఎ క్కువగా ఉన్నాయని టీ మిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో కీపర్‌గా నాలుగు మ్యాచ్‌లు అనుభవం ఉన్న భరత్‌ మినహా మేనేజ్‌మెంట్‌కు మరో మెరుగైన ప్రత్యమ్నాయం లేదని చెప్పాడు. మెగా ఫైనల్లో ఇషాన్‌ కిషన్‌తో అరంగేట్రం చేయించేంత రిస్క్‌ తీసుకోరన్నాడు. కాగా, ఇద్దరు స్పిన్నర్లకు భారత జట్టులో చోటుకల్పిస్తే మాత్రం భరత్‌కు తుది జట్టులో తప్పకుండా చోటు కల్పించాలని శాస్త్రి సూచించాడు. ఇక సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్‌లోనూ భారత జట్టు యాజమాన్యం అతడికే చాన్సిచ్చింది.

Updated Date - 2023-05-26T04:39:47+05:30 IST