కివీస్‌కు బంగ్లా మరో షాక్
ABN , Publish Date - Dec 28 , 2023 | 03:52 AM
మూడో వన్డేలో న్యూజిలాండ్‌ను ఓడించిన జోష్‌లో ఉన్న బంగ్లాదేశ్ టీ20 సిరీ్‌సనూ సంచలన ప్రదర్శనతో ఆరంభించింది. బుధవారం జరిగిన తొలి టీ20లో
నేపియర్: మూడో వన్డేలో న్యూజిలాండ్‌ను ఓడించిన జోష్‌లో ఉన్న బంగ్లాదేశ్ టీ20 సిరీ్‌సనూ సంచలన ప్రదర్శనతో ఆరంభించింది. బుధవారం జరిగిన తొలి టీ20లో ఆతిథ్య జట్టుకు 5 వికెట్ల తేడాతో షాకిచ్చి చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. కివీస్ గడ్డపై బంగ్లాకిదే తొలి టీ20 గెలుపు కావడం విశేషం. తొలుత కివీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 134/9 స్కోరుకే పరిమితమైంది. జేమ్స్ నీషమ్ (48) జట్టులో టాప్ స్కోరర్. షోరిఫుల్ ఇస్లామ్ 3, మెహ్దీ హసన్, ముస్తాఫిజుర్ చెరో 2 వికెట్లు తీశారు. స్వల్ప ఛేదనలో బంగ్లా.. ఓపెనర్ లిట్టన్ దాస్ (42 నాటౌట్), సౌమ్య సర్కార్ (22), షంటో (19), మెహ్దీ హస్ (19 నాటౌట్) రాణించడంతో 18.4 ఓవర్లలోనే 137/5 స్కోరు చేసి గెలిచింది.