సాకేత్‌ జోడీకి బ్యాంకాక్‌ టైటిల్‌

ABN , First Publish Date - 2023-01-15T01:01:55+05:30 IST

తెలుగు కుర్రాడు సాకేత్‌ మైనేని బ్యాంకాక్‌ ఓపెన్‌ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో డబుల్స్‌ విజేతగా నిలిచాడు. సింగిల్స్‌కు గుడ్‌బై చెప్పి ఇటీవలే పూ

సాకేత్‌ జోడీకి బ్యాంకాక్‌ టైటిల్‌

నొంతాబూరి (థాయ్‌లాండ్‌): తెలుగు కుర్రాడు సాకేత్‌ మైనేని బ్యాంకాక్‌ ఓపెన్‌ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో డబుల్స్‌ విజేతగా నిలిచాడు. సింగిల్స్‌కు గుడ్‌బై చెప్పి ఇటీవలే పూర్తిగా డబుల్స్‌ విభాగానికి మారిన భారత ఆటగాడు యుకీ భాంబ్రీతో కలిసి సాకేత్‌ ఈ టైటిల్‌ సాధించాడు. శనివారం ఇక్కడ జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో సాకేత్‌-యుకీ జంట 2-6, 7-6(7) 14-12తో క్రిస్టోఫర్‌ రుంగ్తాక్‌ (ఇండోనేసియా)-అకీరా సాంటిల్లాన్‌ (ఆస్ట్రేలియా)పై గెలిచింది. ఏపీకి చెందిన సాకేత్‌ ఈ ప్రదర్శనతో ఏటీపీ డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో 74వ స్థానంతో కెరీర్‌ బెస్ట్‌గా నిలిచాడు.

Updated Date - 2023-01-15T01:01:57+05:30 IST