Share News

అండర్‌-19 ఆసియా కప్‌ జట్టులో అవినాష్‌, అభిషేక్‌

ABN , First Publish Date - 2023-11-26T02:44:41+05:30 IST

ఏసీసీ పురుషుల అండర్‌-19 ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

అండర్‌-19 ఆసియా కప్‌ జట్టులో అవినాష్‌, అభిషేక్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఏసీసీ పురుషుల అండర్‌-19 ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ బృందంలో హైదరాబాద్‌ క్రికెటర్లు అవినాష్‌ రావు (వికెట్‌కీపర్‌), అభిషేక్‌కు చోటు లభించింది. వచ్చేనెల 8 నుంచి యూఏఈ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. ఇప్పటివరకు భారత్‌ ఎనిమిది సార్లు ఈ ట్రోఫీని గెలుచుకోవడం విశేషం. భారత్‌, పాకిస్థాన్‌, నేపాల్‌, అఫ్ఘానిస్థాన్‌ ఒకే గ్రూపులో ఉన్నాయి. భారత్‌ తన తొలి మ్యాచ్‌ను వచ్చే నెల 8న అఫ్ఘానిస్థాన్‌తో ఆడనుంది. డిసెంబరు 17న ఫైనల్‌ జరగనుంది. పంజాబ్‌కు చెందిన ఉదయ్‌ సహారన్‌ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సౌమి కుమార్‌ పాండే ఉప సారథిగా ఎంపికయ్యాడు.

Updated Date - 2023-11-26T02:46:38+05:30 IST