పాక్ చిత్తుచిత్తు
ABN , Publish Date - Dec 18 , 2023 | 04:02 AM
ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్థాన్‌కు తొలి మ్యాచ్‌లోనే దారుణ పరాభవం. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్ 360 పరుగులతో
తొలి టెస్టులో 360 పరుగులతో ఆసీస్ భారీ గెలుపు
పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్థాన్‌కు తొలి మ్యాచ్‌లోనే దారుణ పరాభవం. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్ 360 పరుగులతో భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో ఓవర్‌నైట్ స్కోరు 84/2తో ఆదివారం ఆట ప్రారంభించిన ఆసీస్.. ఖవాజా (90), మిచెల్ మార్ష్ (63 నాటౌట్), స్మిత్ (45) రాణించడంతో 233/5 స్కోరు వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇక, 449 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. 30.2 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. సాద్ షకీల్ (24) టాప్ స్కోరర్. మిచెల్ స్టార్క్, హాజెల్‌వుడ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, లియాన్ 2 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 487 పరుగులు, పాక్ 271 పరుగులు చేశాయి. మార్ష్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.