McDonald: ‘టెస్టు’లో ఫెయిలయ్యాం

ABN , First Publish Date - 2023-02-21T03:23:17+05:30 IST

భారత్‌తో జరిగిన రెండు టెస్టుల్లో తాము విఫలమయ్యామని ఆస్ట్రేలియా కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ అభిప్రాయపడ్డాడు.

McDonald: ‘టెస్టు’లో ఫెయిలయ్యాం

ఆసీస్‌ కోచ్‌ మెక్‌డొనాల్డ్‌

ఇండోర్‌: భారత్‌తో జరిగిన రెండు టెస్టుల్లో తాము విఫలమయ్యామని ఆస్ట్రేలియా కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఢిల్లీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో తమ బ్యాటర్స్‌ ఆటతీరు ఘోరంగా ఉందన్నాడు. ‘రెండో రోజు ముగిశాక మా సన్నాహకాలు బాగానే ఉన్నాయనే కామెంట్స్‌ వినిపించాయి. కానీ మూడో రోజు ఆట ఆరంభమైన గంటకే మాపై విమర్శలు ప్రారంభమయ్యాయి. ఏదిఏమైనా భారత్‌తో జరిగిన పరీక్షలో మేం ఫెయిలయ్యాం’ అని కోచ్‌ మెక్‌డొనాల్డ్‌ తెలిపాడు.

Updated Date - 2023-02-21T03:23:19+05:30 IST