ఆధారాలుంటే చూపించాలి
ABN , First Publish Date - 2023-10-03T01:03:50+05:30 IST
ఆసియా క్రీడల్లో మహిళల హెప్టాథ్లాన్‌లో కాంస్యపతకంతో సంచలనం సృష్టించిన తెలుగమ్మాయి అగసర నందినిపై సీనియర్ అథ్లెట్ స్వప్నా బర్మన్ తీవ్రమైన ఆరోపణలు చేసింది...
హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో మహిళల హెప్టాథ్లాన్‌లో కాంస్యపతకంతో సంచలనం సృష్టించిన తెలుగమ్మాయి అగసర నందినిపై సీనియర్ అథ్లెట్ స్వప్నా బర్మన్ తీవ్రమైన ఆరోపణలు చేసింది. ‘నేను ఒక ట్రాన్స్‌జెండర్ కారణంగా ఆసియా క్రీడల కాంస్య పతకాన్ని కోల్పోయా. నా మెడల్ నాకు కావాలి. నాకు మద్దతు తెలిపి, సహాయం చేయండి’ అంటూ నందినిని ఉద్దేశించి ట్వీట్ చేసింది. అయితే, స్వప్న ట్వీట్‌పై నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్స్ రావడంతో కొద్దిసేపటికి ఆమె ఆ పోస్ట్‌ను తొలగించింది. ఈ ఉదంతంపై నందిని ఘాటుగా స్పందించింది. ‘నేనేంటో నాకు తెలుసు. ఆమె దగ్గర ఆధారాలుంటే చూపించాలి. నేను కష్టపడి దేశం కోసం పతకం గెలిచా. ఈ విషయాన్ని జాతీయ అథ్లెటిక్స్ సంఘం దృష్టికి తీసుకెళ్తా. అమ్మ ఆరోగ్యం బాగాలేక ఇంటికి వెళుతున్నా. త్వరలో అన్ని విషయాలు తెలుస్తాయి’ అని నందిని వెల్లడించింది.