Share News

అశ్విని జోడీదే ట్రోఫీ

ABN , First Publish Date - 2023-12-11T04:46:41+05:30 IST

గువాహటి మాస్టర్స్‌ సూపర్‌-100 బ్యాడ్మింటన్‌ మహిళల డబుల్స్‌ టైటిల్‌ను అశ్వినీ పొన్నప్ప-తనీషా క్యాస్ట్రో జోడీ సొంతం చేసుకొంది. ఆదివారం జరిగిన ఫైనల్లో...

అశ్విని జోడీదే ట్రోఫీ

గువాహటి: గువాహటి మాస్టర్స్‌ సూపర్‌-100 బ్యాడ్మింటన్‌ మహిళల డబుల్స్‌ టైటిల్‌ను అశ్వినీ పొన్నప్ప-తనీషా క్యాస్ట్రో జోడీ సొంతం చేసుకొంది. ఆదివారం జరిగిన ఫైనల్లో రెండో సీడ్‌ అశ్విని-తనీషా జంట 21-13, 21-19తో చైనీస్‌ తైపీకి చెందిన సంగ్‌ షు యున్‌-యు చెన్‌ హుపై వరుస గేముల్లో నెగ్గి విజేతగా నిలిచింది. అబుదాబి మాస్టర్స్‌, నాన్‌టె్‌స ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ తర్వాత ఈ జోడీకిది మూడో టైటిల్‌. మహిళల సింగిల్స్‌లో చైవాన్‌ లనిన్‌రాట్‌ (థాయ్‌లాండ్‌) 21-14, 17-21, 21-16తో లిన్‌ క్రిస్టోఫర్‌సెన్‌ (డెన్మార్క్‌)పై, ఇద్దరు ఇండోనేసియా ఆటగాళ్ల మధ్య జరిగిన పురుషుల ఫైనల్లో యోహానెస్‌ సౌట్‌ మార్సెల్లీ 21-12, 21-17తో అల్వి విజయ చైరుల్లాపై గెలిచి చాంపియన్లుగా నిలిచారు.

Updated Date - 2023-12-11T04:46:43+05:30 IST