టాప్‌లో అర్జున్
ABN , First Publish Date - 2023-04-22T03:53:29+05:30 IST
తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేసి అర్జున్ సాటీ హాలిజ్ ర్యాపిడ్ చెస్‌లో జోరు కొనసాగిస్తున్నాడు.
ఆస్తానా (కజకిస్థాన్): తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేసి అర్జున్ సాటీ హాలిజ్ ర్యాపిడ్ చెస్‌లో జోరు కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో రెండోరోజైన శుక్రవారం కూడా అర్జున్ 3 విజయాలు, ఓ డ్రాతో అద్భుత ప్రద ర్శన కనబర్చాడు. మొత్తంగా 8రౌండ్లు పూర్తయ్యేసరికి అర్జున్ 7 పాయింట్లతో టాప్‌లో నిలిచాడు. అరోనియన్ (అర్మేనియా) 6 పాయింట్లతో రెండోస్థానంలో ఉన్నాడు. ఐదోరౌండ్‌లో వఖిడోవ్ (ఉజ్బెకిస్థాన్)పై, ఆరోరౌండ్‌లో బిబిసారా (కజకిస్థాన్)పై, ఏడోరౌండ్‌లో బోరిస్ గెల్ఫాండ్ (ఇజ్రాయిల్)పై నెగ్గిన అర్జున్.. విన్సెంట్ (జర్మన్)తో ఆడిన ఎనిమిదో రౌండ్‌ను డ్రాగా ముగించాడు.