Siftkaur Sharma: షూటింగ్‌లో మరో ఒలింపిక్ బెర్త్
ABN , First Publish Date - 2023-08-22T03:03:46+05:30 IST
వర్ధమాన షూటర్ సిఫ్త్‌కౌర్ శర్మ భారత్‌కు ఆరో ఒలింపిక్ బెర్త్‌ను అందించింది.
బాకు (అజర్‌బైజాన్): వర్ధమాన షూటర్ సిఫ్త్‌కౌర్ శర్మ భారత్‌కు ఆరో ఒలింపిక్ బెర్త్‌ను అందించింది. ఐఎ్‌సఎ్‌సఎఫ్ ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షి్‌పలో సోమవారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్‌లో 21 ఏళ్ల సిఫ్త్‌కౌర్ ఐదోస్థానంలో నిలిచింది. ఈ ప్రదర్శనతో ఆమె విభాగం నుంచి వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు బెర్త్ లభించింది.