అమ్మ అదరహో

ABN , First Publish Date - 2023-01-25T00:37:07+05:30 IST

అమ్మగా మారాక తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాలన్న పట్టుదలతో ఉన్న బెలారస్‌ టెన్నిస్‌ స్టార్‌ విక్టోరియా అజరెంకా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో

అమ్మ అదరహో

సెమీ్‌సలో విక్టోరియా అజరెంకా

పురుషుల సెమీ్‌సలో సిట్సిపాస్‌

మెల్‌బోర్న్‌: అమ్మగా మారాక తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాలన్న పట్టుదలతో ఉన్న బెలారస్‌ టెన్నిస్‌ స్టార్‌ విక్టోరియా అజరెంకా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వార్టర్స్‌లో అజరెంకా 6-4, 6-1తో మూడోసీడ్‌ జెస్సికా పెగులాను చిత్తుచేసింది. 30 ఏళ్ల అజరెంకా తన కెరీర్‌లో రెండు గ్రాండ్‌స్లామ్‌ (2012, 2013)లను ఇక్కడే నెగ్గింది. ఫైనల్‌బెర్త్‌ కోసం వింబుల్డన్‌ విజేత ఎలెనా రిబకినాతో అజరెంకా తలపడనుంది. రిబకినా 6-2, 6-4తో ఓస్టాపెంకోను ఓడించింది. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో గ్రీకు వీరుడు సిట్సిపాస్‌ 6-3, 7-6 (2), 6-4తో జిరి లెహెకాను ఓడించాడు. సెమీ్‌సలో కారెన్‌ ఖచనోవ్‌తో తలపడతాడు. మరో క్వార్టర్స్‌లో ఖచనోవ్‌ 7-6(5), 6-3, 3-0తో ఆధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి కోర్దా గాయంతో మ్యాచ్‌ నుంచి తప్పుకున్నాడు.

Updated Date - 2023-01-25T00:37:07+05:30 IST