అఫ్ఘాన్‌ తొలిసారి..

ABN , First Publish Date - 2023-03-26T01:39:28+05:30 IST

పదకొండేళ్లుగా టీ20లలో పాకిస్థాన్‌తో తలపడుతున్న అఫ్ఘానిస్థాన్‌ తొలిసారి విజయం అందుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీ్‌సలో..

అఫ్ఘాన్‌ తొలిసారి..

టీ20లో పాక్‌పై గెలుపు

షార్జా: పదకొండేళ్లుగా టీ20లలో పాకిస్థాన్‌తో తలపడుతున్న అఫ్ఘానిస్థాన్‌ తొలిసారి విజయం అందుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీ్‌సలో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన మొదటి టీ20లో ఆరు వికెట్లతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 20 ఓవర్లలో 92/9 స్కోరుకే పరిమితమైంది. ముజీబ్‌, నబీ, ఫారూఖి రెండేసి వికెట్లు పడగొట్టారు. ఛేదనలో అఫ్ఘాన్‌ 17.5 ఓవర్లలో 98/4 స్కోరుతో ప్రత్యర్థికి షాకిచ్చింది. 38 పరుగులు చేసిన నబీ ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.

Updated Date - 2023-03-26T01:39:28+05:30 IST