Share News

యువజోరుకు బ్రేక్‌

ABN , First Publish Date - 2023-12-11T04:41:12+05:30 IST

అండర్‌-19 ఆసియాక్‌పలో ఫేవరెట్‌ భారత్‌కు చుక్కెదురైంది. అజాన్‌ అవైస్‌ (105 నాటౌట్‌) అజేయ శతకంతో అదరగొట్టడంతో.. గ్రూప్‌-ఎలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్లతో...

యువజోరుకు బ్రేక్‌

  • భారత్‌పై 8 వికెట్లతో పాక్‌ గెలుపు

  • అండర్‌-19 ఆసియా కప్‌

దుబాయ్‌: అండర్‌-19 ఆసియాక్‌పలో ఫేవరెట్‌ భారత్‌కు చుక్కెదురైంది. అజాన్‌ అవైస్‌ (105 నాటౌట్‌) అజేయ శతకంతో అదరగొట్టడంతో.. గ్రూప్‌-ఎలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్లతో పాకిస్థాన్‌ చేతిలో చిత్తుగా ఓడింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 259 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఆదర్ష్‌ సింగ్‌ (62), కెప్టెన్‌ ఉదయ్‌ సహ్రాన్‌ (60), సచిన్‌ దాస్‌ (58) అర్ధ శతకాలు వ్యర్థమయ్యాయి. జిషాన్‌ 4 వికెట్లు తీశాడు. ఛేదనలో పాక్‌ 47 ఓవర్లలో 263/2 స్కోరు చేసి గెలిచింది. షజైబ్‌ ఖాన్‌ (63)తో కలసి రెండో వికెట్‌కు 110 పరుగులు జోడించిన అవైస్‌.. మూడో వికెట్‌కు కెప్టెన్‌ సాద్‌ బేగ్‌ (68 నాటౌట్‌)తో కలసి 125 పరుగుల అభేద్య భాగస్వామ్యంతో జట్టును గెలిపించాడు. స్పిన్నర్‌ మురుగన్‌ అభిషేక్‌ 2 వికెట్లు సాధించాడు. ఆడిన రెండు మ్యాచ్‌ల నుంచి రెండు పాయింట్లు సాధించిన భారత్‌.. సెమీస్‌ చేరాలంటే మంగళవారం నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పక నెగ్గాలి.

Updated Date - 2023-12-11T07:27:55+05:30 IST