రూ.50 కోట్ల ఫ్లాట్‌.. రూ.2 కోట్ల ఆడి కారు

ABN , First Publish Date - 2023-01-27T03:18:34+05:30 IST

కొత్తగా పెళ్లయిన క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌-అతియా శెట్టి జంటకు అత్యంత ఖరీదైన వివాహ కానుకలు లభించాయి. అయితే వచ్చిన కొద్దిపాటి అతిథులతో పాటు రానివారు కూడా ఈ జంటను తమదైన

రూ.50 కోట్ల ఫ్లాట్‌.. రూ.2 కోట్ల ఆడి కారు

రాహుల్‌ దంపతులకు ఖరీదైన కానుకలు

ముంబై: కొత్తగా పెళ్లయిన క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌-అతియా శెట్టి జంటకు అత్యంత ఖరీదైన వివాహ కానుకలు లభించాయి. అయితే వచ్చిన కొద్దిపాటి అతిథులతో పాటు రానివారు కూడా ఈ జంటను తమదైన శైలిలో ఖుషీ చేశారు. బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి తన అల్లుడికి ముంబైలో రూ.50 కోట్ల ఫ్లాట్‌ ఇవ్వగా.. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ రూ.2 కోట్ల 17 లక్షల ఆడి కారును బహుమతిగా పంపాడట. ఎంఎస్‌ ధోనీ కూడా పెళ్లికి రాకపోయినా రూ.80 లక్షల ఖరీదైన కవసాకి నింజా బైక్‌ ఇచ్చాడు. ఇక వధువు అతియాకు సల్మాన్‌ నుంచి కోటీ 64 లక్షల ఆడి కారు, జాకీష్రాఫ్‌ నుంచి 30 లక్షల వాచీ, అర్జున్‌ కపూర్‌ నుంచి కోటిన్నర విలువచేసే డైమండ్‌ నెక్లెస్‌ అందినట్టు సమాచారం.

Updated Date - 2023-01-27T03:18:35+05:30 IST