జాతీయ షూటింగ్‌లో ఉమా మహేశ్‌కు 4 పతకాలు
ABN , First Publish Date - 2023-06-17T01:44:45+05:30 IST
కుమార్ సురేంద్రసింగ్ స్మారక జాతీయ రైఫిల్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలుగు షూటర్ మద్దినేని ఉమా మహేశ్ 4 పతకాలు సాధించాడు.
తిరువనంతపురం: కుమార్ సురేంద్రసింగ్ స్మారక జాతీయ రైఫిల్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలుగు షూటర్ మద్దినేని ఉమా మహేశ్ 4 పతకాలు సాధించాడు. ఇందులో 2 స్వర్ణాలు, 2 రజతాలు ఉండడం విశేషం. శుక్రవారం ఇక్కడ జరిగిన పోటీల్లోని 10 మీటర్ల రైఫిల్ పురుషుల విభాగంలో పసిడి, మిక్స్‌డ్ యూత్ కేటగిరిలో స్వర్ణం, జూనియర్ విభాగం, యూత్ కేటగిరిలో రజతాలు గెలిచాడు.