Share News

బెంగళూరు నుంచి రూ.33 వేలు

ABN , First Publish Date - 2023-11-18T01:32:01+05:30 IST

ప్రపంచకప్‌ ఫైనల్‌ను వీక్షించేందుకు బయలుదేరుతున్న క్రికెట్‌ ప్రేమికులకు విమాన టికెట్ల ధరలు షాకిస్తున్నాయి.

 బెంగళూరు నుంచి రూ.33 వేలు

బెంగళూరు: ప్రపంచకప్‌ ఫైనల్‌ను వీక్షించేందుకు బయలుదేరుతున్న క్రికెట్‌ ప్రేమికులకు విమాన టికెట్ల ధరలు షాకిస్తున్నాయి. సాధారణ రోజుల్లో బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌కు టికెట్‌ ధర రూ.5,700 ఉండగా.. నవంబరు 18వ తేదీకి ఈ రూట్‌లో టికెట్‌ కోసం ఏకంగా రూ. 33 వేలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెరిగిన డిమాండ్‌ నేపథ్యంలో ఇండిగో సంస్థ శనివారం బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌కు ఆరు సర్వీసులు నడుపుతోంది. ఈ చార్జీలను తట్టుకోలేని కొందరు కొందరు అభిమానులు ముంబై వరకూ విమానంలో వెళ్లి, అక్కడినుంచి అహ్మదాబాద్‌ చేరుకొనే యోచనలో ఉన్నారు. అయితే ముంబైకి కూడా వన్‌ వే చార్జీలు రూ.16,000కు పైగానే ఉన్నాయి.

Updated Date - 2023-11-18T01:32:03+05:30 IST