Share News

కివీస్‌కు షాక్‌ బంగ్లాదే తొలి టెస్టు

ABN , First Publish Date - 2023-12-03T02:12:44+05:30 IST

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ జట్టు 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీ్‌సలో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అలాగే స్వదేశంలో కివీ్‌సను ఓడించడం బంగ్లాకిదే తొలిసారి.

కివీస్‌కు షాక్‌ బంగ్లాదే తొలి టెస్టు

సిల్హెట్‌: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ జట్టు 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీ్‌సలో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అలాగే స్వదేశంలో కివీ్‌సను ఓడించడం బంగ్లాకిదే తొలిసారి. 332 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీ్‌సను లెఫ్టామ్‌ స్పిన్నర్‌ తైజుల్‌ ఇస్లాం ఆరు వికెట్లతో కట్టడి చేశాడు. ఫలితంగా శనివారం ఆఖరిరోజు పర్యాటక జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే కుప్పకూలింది. డారిల్‌ (58) మాత్రమే రాణించాడు. బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 310, రెండో ఇన్నింగ్స్‌లో 338 పరుగులు చేయగా.. న్యూజిలాండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 317 పరుగులు చేసింది. ఓవరాల్‌గా పది వికెట్లు తీసిన తైజుల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

Updated Date - 2023-12-03T02:12:45+05:30 IST