Vijay Devarakonda- Dil raju: కాంబినేషన్‌ సెట్‌ అయింది!

ABN , First Publish Date - 2023-02-05T21:01:04+05:30 IST

గీత గోవిందం’తో బ్లాక్‌ బస్టర్‌ కాంబినేషన్‌ అనిపించుకున్న విజయ్‌ దేవరకొండ - పరశురామ్‌ కాంబోలో మరో చిత్రం రానుంది. శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

Vijay Devarakonda- Dil raju: కాంబినేషన్‌  సెట్‌ అయింది!

‘గీత గోవిందం’తో (Geetha govindam)బ్లాక్‌ బస్టర్‌ కాంబినేషన్‌ అనిపించుకున్న విజయ్‌ దేవరకొండ (Vijay devarakonda) - పరశురామ్‌ (Parasuram) కాంబోలో మరో చిత్రం రానుంది. శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు(Dil raju), శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ విషయాన్ని ఎస్‌.వి.సి క్రియేషన్స్‌ సంస్థ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. సరికొత్త కథతో తెరకెక్కనున్న ఈ చిత్రంతో విజయ్‌ మొదటిసారి దిల్‌ రాజు బ్యానర్‌ పని చేయనుండడంతో చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. (Vijay devarakonda - Parasuram Team up again)

ప్రస్తుతం దిల్‌ రాజు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి తమిళ హీరో విజయ్‌ నటించిన ‘వారిసు’ చిత్రాన్ని విడుదల చేశారు. రామ్‌చరణ్‌-శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న‘ఆర్‌సీ 15’తోపాటు పలు ప్రాజెక్ట్‌లను దిల్‌ రాజు పైప్‌లైన్‌లో పెట్టారు.

Updated Date - 2023-02-05T21:01:05+05:30 IST