Arjun Das: నటుడిలోని కొత్త కోణాన్ని డైరెక్టర్స్ ఉపయోగించుకుంటారా.?

ABN , First Publish Date - 2023-02-05T15:09:17+05:30 IST

‘ఖైదీ’, ‘మాస్టర్’ (Master), ‘విక్రమ్’ వంటి సినిమాల్లో విలన్ రోల్స్‌తో ప్రేక్షకులను మెప్పించిన నటుడు అర్జున్ దాస్ (Arjun Das). ఆయన బేస్ వాయిస్‌కు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు.

Arjun Das: నటుడిలోని కొత్త కోణాన్ని డైరెక్టర్స్ ఉపయోగించుకుంటారా.?

‘ఖైదీ’, ‘మాస్టర్’ (Master), ‘విక్రమ్’ వంటి సినిమాల్లో విలన్ రోల్స్‌తో ప్రేక్షకులను మెప్పించిన నటుడు అర్జున్ దాస్ (Arjun Das). ఆయన బేస్ వాయిస్‌కు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. అందువల్ల అర్జున్ నటించే సినిమాలకు ఆయననే డబ్బింగ్ చెప్పమంటూ నిర్మాతలు కోరుతుంటారు. అర్జున్ దాస్ తాజాగా ‘బుట్ట బొమ్మ’ (Butta Bomma) లో నటించారు. అనికా సురేంద్రన్, సూర్య వశిష్ట కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 4న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.

అర్జున్ దాస్ ఎక్కువగా నెగెటివ్ రోల్స్‌తో ప్రేక్షకులను మెప్పించారు. ఆయన తన కెరీర్‌లోనే తొలిసారిగా ‘బుట్ట బొమ్మ’ లో పాజిటిల్ రోల్‌లో కనిపించారు. స్క్రీన్ మీద కనిపించింది కాసేపే అయినప్పటికీ తన నటనతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో అర్జున్ నటనకు ప్రేక్షకుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు లభించాయి. మేకర్స్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని అర్జున్ దాస్ ఏ మాత్రం వమ్ము చేయలేదు. ఆ పాత్రకు తాను మాత్రమే సరిపోతాడనేలా నటించారు. అర్జున్ దాస్‌లోని కొత్త కోణాన్ని డైరెక్టర్స్ ఉపయోగించుకుంటారా లేదా నెగెటివ్ రోల్స్‌లోనే చూపిస్తారా అనేది తెలియాలంటే మాత్రం కొంత కాలం ఆగాల్సిందే. ‘బుట్ట బొమ్మ’ మలయాళీ హిట్ ‘కప్పేలా’ కు రీమేక్‌గా రూపొందింది. ఒరిజినల్ వెర్షన్‌ను తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి ‘బుట్టబొమ్మ’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

Updated Date - 2023-02-05T15:11:05+05:30 IST