SS Rajamouli: మాకు కె.విశ్వనాథ్ గారు ఉన్నారని రొమ్ము విరిచి గర్వంగా చెప్పుకుంటాం: రాజమౌళి

ABN , First Publish Date - 2023-02-03T10:28:18+05:30 IST

ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితమే ప్రముఖ నటి జమున మృతి చెందారు.

SS Rajamouli: మాకు కె.విశ్వనాథ్ గారు ఉన్నారని రొమ్ము విరిచి గర్వంగా చెప్పుకుంటాం: రాజమౌళి

టీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితమే ప్రముఖ నటి జమున మృతి చెందారు. ఆ విషయాన్ని పూర్తిగా మరవకముందే మరో సినీ దిగ్గజం నేలకొరిగింది. కళా తపస్వీ కె. విశ్వనాథ్‌ (K Viswanath) గత రాత్రి 11 గంటలకు స్వర్గస్తులయ్యారు. దీంతో పలువురు టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు. విశ్వనాథ్ మరణం సినీ పరిశ్రమకి తీరని లోటని దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

‘ప్రపంచంలో ఎవ్వరైనా మీ తెలుగు సినిమా గొప్పదనం ఏంటి అని అడిగితే.. మాకు కె.విశ్వనాథ్ గారు ఉన్నారని రొమ్ము విరిచి గర్వంగా చెప్పుకుంటాం. తెలుగు చిత్ర పరిశ్రమ మిమ్మల్ని ఎప్పటి మర్చిపోలేదు. సినిమా గ్రామర్‌లో మీరు నేర్పిన పాత్రలకు ఆజన్మాన్తo రుణపడి ఉంటాం సర్’

- ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli)


భారతదేశపు మొదటి రచయిత దర్శకుడైన కె.విశ్వనాథ్ మరణించడం బాధాకరం. ఆయన మరణించినా.. ఆయన సినిమాలు శాశ్వతంగా ఉంటాయి

- రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma)

Updated Date - 2023-02-03T10:34:48+05:30 IST