Share News

Horoscope : రాశిఫలాలు

ABN , First Publish Date - 2023-11-29T07:15:47+05:30 IST

నేడు (29-11-2019 - బుధవారం) వృషభ రాశివారు స్టాక్‌మార్కెట్‌ లావాదేవీల్లో లాభాలు ఆ ర్జిస్తారు. గత అనుభవంతో ఆదాయం పెంపొందించుకుంటారు. ఆస్పత్రులు, బ్యాంకులు, ఫార్మా రంగాల్లో పనిచేసే వృశ్చిక రాశి వారికి నేడు డబ్బే డబ్బు.. ఆర్థికంగా బాగా కలిసొస్తుందట.

Horoscope : రాశిఫలాలు

నేడు (29-11-2019 - బుధవారం) వృషభ రాశివారు స్టాక్‌మార్కెట్‌ లావాదేవీల్లో లాభాలు ఆ ర్జిస్తారు. గత అనుభవంతో ఆదాయం పెంపొందించుకుంటారు. ఆస్పత్రులు, బ్యాంకులు, ఫార్మా రంగాల్లో పనిచేసే వృశ్చిక రాశి వారికి నేడు డబ్బే డబ్బు.. ఆర్థికంగా బాగా కలిసొస్తుందట. ఇక నేడు అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలమైన రోజు, మార్కెటింగ్‌, కమ్యూనికేషన్ల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితులతో ప్రయాణాలు, చర్చలు ఉ ల్లాసం కలిగిస్తాయి. మెయిల్స్‌, సందేశాలు అందుకుంటారు. గణపతి ఆరాధన శుభప్రదం.

MESHAM-02.jpg

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

స్టాక్‌మార్కెట్‌ లావాదేవీల్లో లాభాలు ఆ ర్జిస్తారు. గత అనుభవంతో ఆదాయం పెంపొందించుకుంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పెన్షన్‌, గ్రాట్యుటీ నిధులు చేతికి అందుతాయి. ఆర్థిక పరిస్థిత ప్రోత్సాహకరంగా ఉంటుంది. రామచంద్రమూర్తి ఆరాధన శుభప్రదం.

MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

కొత్త పరిచయాలు ఆనందం కలిగిస్తాయి. వివాహ నిర్ణయాలకు అనుకూలం. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. భాగస్వామి గురించి ఆలోచిస్తారు. ఆర్థిక విషయాల్లో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. శ్రీరామరక్షా స్తోత్ర పారాయణ శుభప్రదం.

MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

రాజకీయ, సినీ రంగాల వారి కృషి ఫలిస్తుంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోద్యోగుల ఆంతరంగిక విషయాలు చర్చకు వస్తాయి. ఎగుమతులు, కళలు, వస్త్రాలు, ఫొటోగ్రఫీ వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

MESHAM-05.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. వేడుకల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు. అనుబందాలు బలపడతాయి. పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలం అందుకుంటారు.

MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

తల్లిందండ్రుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. పెద్దల వైఖరిలో మార్పు గమనిస్తారు. బదిలీలు, మార్పులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణ శుభప్రదం.

MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు సంబంధించి అనుకూల సమాచారం అందుకుంటారు. చర్చలు, ప్రయాణాలకు అనుకూలమైన రోజు. రవాణా, బోదన, న్యాయ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు.

MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఆస్పత్రులు, బ్యాంకులు, ఫార్మా రంగాల్లో పనిచేసే వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకున్న డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. శ్రీరామచంద్రుని ఆరాధన శుభప్రదం.

MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. భాగస్వామి వైఖరి ఆనందం కలిగిస్తుంది. వ్యాపార రంగంలోని వారు కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. సమావేశాల్లో ప్రశంసలు అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.

MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

యోగ ధ్యానాలు, డైటింగ్‌పై దృష్టి సారిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. లక్ష్య సాధనలో గత అనుభవం తోడ్పడుతుంది. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులు, పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ప్రకటనలు, క్రీడలు, టెలివిజన్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుబంధాలు బలపడతాయి.

MESHAM-FINAL-12.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

గృహారంభ, ప్రవేశాలకు అనకూలం. ఉన్నత పదువుల అందుకుంటారు. స్థలం మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తల్లిదండ్రుల విషయాల్లో మంచి పరిణామాలు చోటుచేసుకుంటాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - 2023-11-29T07:24:12+05:30 IST