Horoscope : రాశిఫలాలు
ABN , First Publish Date - 2023-05-20T07:47:40+05:30 IST
నేడు (20-5-2023 - శనివారం) కొన్ని రాశుల వారికి అంతా మంచే జరుగుతుందని ప్రముఖ జోతిష్య పండితుడు బిజుమళ్ల బిందుమాధవ శర్మ తెలిపారు.
నేడు (20-5-2023 - శనివారం) కొన్ని రాశుల వారికి అంతా మంచే జరుగుతుందని ప్రముఖ జోతిష్య పండితుడు బిజుమళ్ల బిందుమాధవ శర్మ తెలిపారు. కొన్ని రాశులవారికి పెండింగ్ బిల్లులన్నీ మంజూరు అవతాయని తెలిపారు. ఇక అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
పాఠశాలలు, మార్కెటింగ్, ట్రెయినింగ్, ట్రాన్స్‌పోర్ట్, స్టేషనరీ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు అడ్మిషన్లు పొందుతారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. విలువైన పత్రాలు అందుకుంటారు.

వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక వ్యవహారాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. పెండింగ్ బిల్లులు మంజూరు అవుతాయి. చిట్‌ఫండ్‌లు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా వుంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన మంచిది.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
మనసు ఉల్లాసంగా వుంటుంది. దూర ప్రయాణాలు, ఉన్నత విద్యా విషయాలపై ఒ క నిర్ణయానికి వస్తారు. నూతన పరిచయాలు లాభిస్తాయి. వ్యక్తిగత సౌకర్యాలు గురించి ఆలోచిస్తారు. సంకల్పం ఫలిస్తుంది. ఆంజన్యే స్వామి ఆరాధన మేలు కలిగిస్తుంది.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అనుకూలం. దూరంలో వుండే బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. గత అనుభవం లక్ష్య సాధనకు తోడ్పడుతుంది. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. వినోద , విహారాలు ఊరటనిస్తాయి. మహావిష్ణువు ఆరాధన శుభప్రదం.

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
బ్యాంకులతో లావాదేవీలకు అనుకూలం. యూనియన్ కార్యకలాపాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఊరేగింపులు, ప్రదర్శనల్లో కీలకపాత్ర పోషిస్తారు. వేడుకల్లో ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. శ్రీరాముడి ఆరాధన మేలు కలిగిస్తుంది.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా వుంటుంది. ప్రమోషన్లు, గౌరవ పదవుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రోత్సాహకరం. పైఅధికారు వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
సమావేశాలు, వేడుకల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు. కమ్యూనికేషన్లు, ఉన్నత విద్య, ఆడిటింగ్ రంగాల వారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. చర్చలు, ప్రయాణాల్లో కొంత ప్రతికూలత ఎదురయ్యే అవకాశం వుంది. ఆంజనేయ స్వామిని స్మరించండి.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక వ్యవహారాలను సమీక్షించుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బీమా, మెడికల్ క్లెయిములకు సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. పెట్టుబడుల విషయంలో నిదానం అవసరం. వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించండి.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
సమావేశాలు, వేడుకల్లో కీలకపాత్ర పోషిస్తారు. నూతన భాగస్వామ్యాలకు అనుకూలం. కొత్త పరిచయాలు ఉల్లాసం కలిగిస్తాయి. వివాహ నిర్ణయాలకు అనుకూలం. స్టాక్‌మార్కెట్ లావాదేవీలు, పందాలు, పోటీల్లో నిదానం అవసరం.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
సేవలు, వ్యవసాయం, పరిశ్రమలు, డెయిరీ రంగాల వారికి ప్రోత్సాహకరం. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఆహార నియమాలు పాటిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమాధిక్యం తప్పకపోవచ్చు. ఆస్పత్రులు సంద ర్శించాల్సి రావచ్చు. రాములు వారి ఆలయాన్ని దర్శించండి.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
క్రీడలు, సృజనాత్మక రంగాల వారికి ప్రోత్సాహకరం. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. చిన్నారులు, ప్రియతముల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. విద్యార్థుకు శుభప్రదం. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించండి.

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి అనుకూలం. గృహారంభ, ప్రవేశాల గురించి ఆలోచిస్తారు. ఇల్లు, స్థలం మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మనసు మార్పు కోరుకుంటుంది. కుటుంబ సభ్యుల వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది. మహావిష్ణువును ధ్యానించండి.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ