Horoscope : రాశిఫలాలు
ABN , First Publish Date - 2023-05-06T07:26:45+05:30 IST
నేడు కొన్ని రాశుల వారు ఆర్థిక విషయాల్లో ఆచి తూచి అడుగు వేయాలని ప్రముఖ జ్యోతిష్య పండితుడు బిజుమళ్ళ బిందుమాధవ శర్మ తెలిపారు.
నేడు కొన్ని రాశుల వారు ఆర్థిక విషయాల్లో ఆచి తూచి అడుగు వేయాలని ప్రముఖ జ్యోతిష్య పండితుడు బిజుమళ్ళ బిందుమాధవ శర్మ తెలిపారు. ఇక కొన్ని రాశుల వారు తమ శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారని వెల్లడించారు. నేడు అన్ని రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. చిన్నారులు, ప్రియతముల విషయాల్లో శుభపరిణామాలు సంభవం బీమా, పన్నుల వ్యవహారాల గురించి ఆరా తీస్తారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి.

వృషభం (ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువులు సేకరిస్తారు. మనసు ఉల్లాసంగా వుంటుంది. శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. ప్రియతములతో చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. ఖర్చులు అధికం.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
ఉపాథి, సేవల రంగాల వారికి ప్రోత్సాహకరం. విందు వినోదాలు, వేడుకల్లో పాల్గొంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిపరమైన ప్రయాణాలు, చర్చల్లో కొంత నిదానం పాటించాలి. విష్ణు సహస్రనామ పారాయణ మంచిది.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
ప్రేమానుబంధాలు బలపడతాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. చిట్‌ఫండ్‌లు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితిపై ప్రియతములతో చర్చిస్తారు. అదనపు ఆదాయం సమకూర్చుకుంటారు. మనసు ఉల్లాసంగా వుంటుంది. వ్యయం అధికం. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
మీ ఆలోచనలు సమీక్షించుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. బదిలీలు, మార్పులకు అనుకూలం. అద్దె నిర్ణయం వ్యవహారం ఒక కొలిక్కి వస్తుంది. తల్లిదండ్రుల వైఖరి కొంత ఆ వేదన కలిగిస్తుంది. ఆలయదర్శనం శుభ ప్రదం.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
సోదరీసోదరుల విషయాలను సమీక్షించుకుంటారు. విలువైన పత్రాలు అందుకుంటారు. బంధుమిత్రులతో ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. విదేశీ ప్రయాణాలకు అనుకూలం. రహస్య సమాచారం తెలుసుకుంటారు.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
బహుమతులు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. పెట్టుబడులపై బంధుమిత్రులతో చర్చిస్తారు. ఉత్సవాలు, ప్రదర్శనల కోసం ఖర్చు చేస్తారు. విలువైన వ స్తువుల కోల్పోయే ప్రమాదం ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన మంచిది.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
సమావేశాల్లో సత్కారాలు, ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుంటారు. గౌరవ మన్ననలు పెంపొందుతాయి. ప్రముఖులతో సమావేశాలు లాభిస్తాయి. కుటుంబ పెద్దల వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
గత అనుభవం లక్ష్య సాధనకు తోడ్పడుతుంది. సమావేశాలు, ఊరేగింపుల్లో పాల్గొంటారు. మనసు ఉల్లాసంగా వుంటుంది. దూరంలో ఉన్న బంధుమిత్రులకు సంబంధించిన పనులు పూర్తి చేస్తారు. విదేశీ ప్రయాణాలకు అనుకూలం.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
వేడుకల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థికపరమైన సమాశాలు ఫలిస్తాయి. బృందకార్యక్రమాల కోసం ఖర్చు అంచనాలు మించే అ వకాశం ఉంది. మహావిష్ణు ఆరాధన మంచిది.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన సమావేశాలకు అనుకూలం. కొత్త పరిచయాలు లాభిస్తాయి. అందరి మన్ననలు పొందుతారు. శ్రీవారు, శ్రీమతితో వేడుకల్లో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాల్లో పెద్దల జోక్యం వల్ల సమస్యలు ఎదురవుతాయి.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
వృత్తిపరమైన వ్యూహాలు ఫలిస్తాయి. సమావేశాలు, వేడుకలు, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాథి, హోటల్, వైద్య రంగాల వారు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. సంకల్పం సాధనకు కొంత అధికంగా శ్రమించాలి. వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ