లైఫ్‌లో లవ్వే లేదని బాధపడిపోతున్న సింగిల్స్‌కు బంపరాఫర్.. అక్కడ హోటల్‌లో వాళ్లకు మాత్రమే 10 శాతం డిస్కౌంట్..!

ABN , First Publish Date - 2023-02-16T16:57:46+05:30 IST

లవ్ లేదని బాధపడిపోయే సింగిల్స్ కు కొన్ని ఓదార్పులు లభించాయి

లైఫ్‌లో లవ్వే లేదని బాధపడిపోతున్న సింగిల్స్‌కు బంపరాఫర్.. అక్కడ హోటల్‌లో వాళ్లకు మాత్రమే 10 శాతం డిస్కౌంట్..!

ప్రేమ లేదని ప్రేమించరాదని అని పాడుకునేవాళ్ళంతా తమ జీవితంలో లవ్వు లేక గతంలో గాయాలు గుచ్చుతుంటే ఫీలైపోతుంటారు. అయితే లవ్ లేదని బాధపడిపోయే సింగిల్స్ కు కొన్ని ఓదార్పులు లభించాయి వాలెంటైన్స్ డే రోజు. 'మీకు మేమున్నాం బాధపడకండి, రండి తినండి బిల్ లో 10శాతం డిస్కౌంట్ తీసుకోండి' అని బోర్డేసి మరీ సంఘీభావం తెలిపాయి. ఇంతకీ ఈ డిస్కౌంట్ గోల ఏంటి చూస్తే..

హైదరాబాద్, ముంబై, ఢిల్లీ లాంటి నగరాలలో రెస్టారెంట్లు, హోటల్స్ వ్యాపారాన్ని పెంచుకోవడానికి కనిపించే ఏ మార్గాన్ని వదిలిపెట్టవు. వాలెంటైన్స్ డే కూడా వారికి ఓ వ్యాపార సూత్రమే.. ఢిల్లీలో రాజేంద్రనగర్ లో ఓ హోటల్ బోర్డ్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. సింగిల్స్ కు 10శాతం డిస్కౌంట్ అంటూ ఆ బోర్డ్ అందరినీ తమ వైపు అట్రాక్ట్ చేస్తోంది. ఇక వాలెంటైన్స్ డే ను వ్యాపారంగా మార్చుకోవడంలో భాగంగా గురుగావ్ కు చెందిన 31ఏళ్ళ ఏళ్ళ వ్యక్తి 'ఒంటరిగా ఉన్న అమ్మాయిలు నన్ను అద్దెకు తీసుకోండి వాలెంటైన్స్ డే రోజు మీకు మంచి టైంపాస్ ఇస్తాను, బాయ్ ఫ్రెండ్ ఎలా ఉంటాడో నేను మీతో అలాగే ఉంటాను' అని చెప్పుకొచ్చాడు. ఇవన్నీ వ్యాపార సూత్రాలే అని చాలా మంది అంటున్నా సింగిల్స్ విషయంలో ఇలా అయినా కాస్త ఓదార్పు దొరుకుతోందిలే అని ఫీల్ గుడ్ గా ఉన్నారు మరికొందరు. కాగా అయ్యో డిస్కౌంట్ ఇచ్చి చేసిన మేలు ఏముంటుంది. ఆ సింగిల్ డిస్కౌంట్ కోసం వెళ్ళేవాళ్ళు సింగిల్ గా వెళతారా ఏంటి ఏ ఫ్రెండ్ నో తోడు తీసుకుని వెళతాడు. దాంతో హోటల్ కు బిజినెస్ పెరుగుతుంది. వాళ్ళదేం పోయింది అంటున్నారు జీవిత సత్యం తెలుసుకున్న మరికొందరు. ఏదిఏమైనా కొందరికి వాలెంటైన్స్ డే ఇలా ఉపయోగపడిందనమాట.

Read also: Viral Photo: మీ కంటి చూపునకు ఓ పరీక్ష.. ఈ ఫొటోలో ఉన్న సంఖ్య ఎంతో చెప్పగలరా..?

Updated Date - 2023-02-16T16:59:22+05:30 IST