Viral News : రెక్కాడితే గానీ డొక్కాడని కార్మికుడు అద్భుతం చేశాడుగా.. ఇతని కథగానీ మీరు చదివారో..!

ABN , First Publish Date - 2023-06-07T15:27:18+05:30 IST

డాన్స్ చేస్తున్నప్పుడు వచ్చే తృప్తి, ఆనందం మరెందులోనూ లేదంటాడు టోడి.

Viral News : రెక్కాడితే గానీ డొక్కాడని కార్మికుడు అద్భుతం చేశాడుగా.. ఇతని కథగానీ మీరు చదివారో..!
performance

సంకల్పం ఉంటే దానంతట అదే పేరును తెచ్చిపెడుతుందనేది టోడి విషయంలో నిజమైంది. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన వ్యక్తి సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యాడు. అతనిలోని ప్రతిభ పదిమందినీ ఆకర్షించింది. దానికి తోడు చిన్న పిల్లలు చురుగ్గా కదులుతూ డాన్స్ భంగిమలు ప్రదర్శిస్తుంటే ఆ వీడియోలు లక్షల్లో వ్యూస్ తెచ్చిపెట్టాయి. అంతేనా తన ప్రతిభను లోకానికి చూపింది. అతని కథలోకి వెళితే..

సంసోల్, పశ్చిమ బెంగాల్ లోని ప్రాంత్రం. మధ్యాహ్నం ఎండ 40 డిగ్రీలు చూపిస్తుంది. పశ్చిమ బెంగాల్ లోని బొగ్గు బెల్ట్ లోని అసన్ సోల్ జిల్లాలో అప్పుడప్పుడు ఇలా గాలి వేడిగా ఉండటం కూడా మామూలుగా ఉంటూనే ఉంటుంది. ఇక్కడ ఎండ వేడికి అక్కడి ప్రజలు, పశువులు అలవాటైపోయాయి.

ఆ పట్టణానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఇటుకలతో కట్టిన రెండుగదుల రేకుల షెడ్ లోపల ఆరు నుంచి ఏడుగురు అమ్మాయిలు డాన్స్ చేస్తున్నారు. వారిలో కొందరు రిహార్సల్స్ చేస్తున్నారు. ఇక్కడ మామూలుగా కనిపించే దృశ్యమే ఇది. ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు ప్రారంభమై రాత్రి 10 గంటల వరకూ ఈ డాన్స్ రిహార్సల్స్ జరుగుతూనే ఉంటాయి. యువకులతో ఆ ప్రదేశం కళకళలాడిపోతూ కనిపిస్తుంది. 90లనాటి పాటలతో మొదలకుని అప్పటి బాలీవుడ్ ఫేమస్ సాంగ్స్ వరకూ ఆ పాదాలు కదులుతూ శరీరాలు లయతో ఊగుతూ కనిపిస్తాయి. మధ్యలో ఓ 28 ఏళ్ళ యువకుడు వాళ్ళ కదలికలలోని తప్పిదాలను సరిచేస్తూ కనిపిస్తాడు. అతనే జెడి. సర్ అని పిలిచే అజయ్ టోడి. ఈ రెండుగదుల రేకుల షెడ్డే అతని అకాడమీ.

డాన్స్ చేయాలనేది అతని చిన్ననాటి కల. దానికి జీవితం సహకరించలేదు. పరిస్థితులుకు తగ్గట్టుగా భవన నిర్మాణ పనికి వెళ్ళడానికి అలవాటు పడ్డాడు టోడి. అదే జీవితంగా మాత్రం ఉండిపోలేదు. అతనికి ఇష్టమైన డాన్స్‌ని మాత్రం వదలలేదు. అక్కడి గల్లీ పిల్లలకు తన డాన్స్ నేర్పిస్తూ, వాళ్ళను డాన్స్ పోటీలకు శిక్షణ ఇస్తున్నాడు. అసలు తన డాన్స్ ప్రయాణం కోల్‌కతాలో జరిగిన ఈ పోటీ గ్రూప్‌‌తో పరుగందుకుంది. మూడు రౌండ్లలో గెలిచి ముంబైకి వెళ్లడానికి షార్ట్‌లిస్ట్ చేయబడ్డారు. కాల్ రాలేదు.. టోడి నిరాశపడలేదు.. కానీ డ్యాన్స్‌ను ఎప్పటికీ వదులుకోకూడదని నిర్ణయించుకున్నాడు.

ఇదేదో పెద్ద అకాడమీ అనుకుని అతనికి ఇప్పుడు అసన్ సోల్ పట్టణం దాని పరిసర ప్రాంతాల నుండి డాన్స్ తరగతులు చెప్పమని ఎందరో వస్తున్నారు. మహారాష్ట్ర, హర్యానాలోని సుదూర ప్రాంతాల నుండి కూడా టోడికి కాల్స్ వస్తున్నాయి, ఎందుకంటే అకాడమీ విద్యార్థులు ఉండగలిగే చోటు ఏదో పెద్దదనే ఆలోచనతో అంతా కాల్స్ చేస్తున్నారు.. దీనికి కారణం లేకపోలేదు. 834K ఫోలోవర్స్‌తో టోడి తన Instagramలో గ్రామంలో, కొన్ని మట్టి ఇళ్ళ ముందు అతని విద్యార్థులతో ప్రదర్శించిన డ్యాన్స్ వీడియోలు వైరల్‌గా మారటమే కాదు..అకాడమీ పేజీలోని వీడియోలకు లక్షకు పైగా లైక్‌లు వచ్చాయి.

ప్రారంభ సంవత్సరాల్లో, ఇది పోటీలు, చిన్న బ్యాచ్‌ల గురించి. టోడి, అతని విద్యార్థులు వీడియోలను 2018లో టిక్‌టాక్‌లో పెట్టేవారు. అప్పటికి చవకైన ఇంటర్నెట్‌తో టిక్‌టాక్ గ్రామీణ భారతదేశంలో విప్లవాత్మకంగా ప్రవేశించింది. డ్యాన్సర్లు, రాపర్లు, గాయకులు, చిన్న వీడియో చేసి ప్రతి ఒక్కరూ వైరల్ అయ్యారు. ఈ వీడియోలను టోడి గ్రూప్‌లోని స్నేహితుల్లో ఒకరు Youtubeలో చిన్న వీడియోలు చేసి పెట్టేవాడు. 2020లో భారతదేశంలో TikTok నిషేధించబడింది. ఇన్‌స్టాగ్రామ్‌ మాధ్యమంతో వైరల్ అవడం ప్రారంభమైనంది. గత ఏడాది జూన్‌లో ఒక వీడియోకు మూడు లక్షల లైక్‌లు వచ్చాయి. అది టర్నింగ్ పాయింట్. అప్పటి నుండి మా సబ్‌స్క్రైబర్‌లు, వీడియోలకు లైక్‌లు పెరిగాయి.

ఇది కూడా చదవండి: కోడిగుడ్డు పెంకులు పనికి రావని పారేస్తున్నారా..? అవి ఇలా కూడా పనికొస్తాయని అస్సలు ఊహించలేరు..!

ఎన్ని మారినా అజయ్ టోడి సోషల్ మీడియా ఫేమ్ అతని ఆర్థిక పరిస్థితిని పెద్దగా మార్చలేదు. అతను తన భార్య, నానమ్మ, ఆరేళ్ల కొడుకుతో కలిసి గ్రామంలో ఒక చిన్న మట్టి ఇంట్లో నివసిస్తున్నాడు. పెద్ద ఈవెంట్‌లకు డ్యాన్స్ టీమ్‌లోని కోర్ టీమ్ సభ్యులతో చేసే ప్రదర్శనలకు వచ్చేది కొంత మొత్తమే. నెలకు అతని మొత్తం సంపాదన ఎనిమిది వేలు మాత్రమే, అది చాలక సొంత సంపాదన కోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ.500 వసూలు చేస్తున్నాడు. అతనికి ఇప్పుడు దాదాపు 40 మంది విద్యార్థులు ఉన్నారు.

ప్రతిభ ఎంత ఉన్నా ఆర్థిక అవసరాలకు తగినట్టుగా సంపాదన అందకపోవడం టోడికి కాస్త నిరాశనే మిగిల్చింది. అయినా డాన్స్ చేస్తున్నప్పుడు వచ్చే తృప్తి, ఆనందం మరెందులోనూ లేదంటాడు టోడి. ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా డాన్స్‌ని దూరం చేసుకోలేనంటాడు. ఇంత గుర్తింపును ఇచ్చిన సోషల్ మీడియానే తనకు ఆర్థికపరమైన భరోసానూ ఇస్తుందని ఆశిస్తున్నానంటాడు. అతని ఆశ నెరవేరాలని మనమూ కోరుకుందాం.

Updated Date - 2023-06-07T15:27:18+05:30 IST