Population Increases: 2022 డిసెంబర్ నాటికి భారత్ జనాభా ఎంతంటే.. దీనితో ఎలాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందంటే..!

ABN , First Publish Date - 2023-01-19T14:48:59+05:30 IST

ఆహారం సంవృద్ధిగా ఉంటేనే మనిషి జీవనం సరిగా సాగుతుంది.

Population Increases: 2022 డిసెంబర్ నాటికి భారత్ జనాభా ఎంతంటే.. దీనితో ఎలాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందంటే..!
Population Increases

జనాభా పెరుగుదల దేశ అభివృద్ధిని కుంగదీసే అంశం. మామూలుగా జనాభా సంగతికొస్తే చైనా భారత్ కన్నా ఎక్కువ జనాభాను కలిగి ఉన్నదనేది ఒకప్పటి సత్యం. కానీ ఈమధ్య కాలంలో తేలిన జనాభా లెక్కల ప్రకారం చైనా జనాభాలో తగ్గుదల కనిపించిందని వరల్డ్ పాపులేషన్ రివ్వూలు అంటున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్ ముందంజలో ఉంది. ఇప్పటికే జనాభాలో పొరుగు దేశాన్ని దాటేసిన భారత్ ఇది కుంగుబాటుకు దారితీస్తుందని, అభివృద్ధి పరంగా వెనుకంజేనని అంటున్నాయి పై లెక్కలు.

అసలు జనాభా పెరిగితే..

ముంబాయి, ఢిల్లీ, కోల్కతా, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, పూణే, కాన్పూర్, సూరత్ ఇలా అన్ని ప్రధాన పట్టణాలలోనూ దేశ జనాభా గత వందేళ్లలోనూ ఐదురెట్లు పెరిగింది. 2022 డిసెంబర్ నాటికి భారత్ జనాభా ఎంతంటే.. 141.7 కోట్లకు చేరిందని డబ్ల్యూపీఆర్ అంచనా.

అధిక జనాభాతో మానవ వనరులు కొరత..

పెరుగుతున్న దేశ జనాభా ముందు ఎదురుకాబోతున్న పెద్ద సవాల్ వనరుల కొరత. ఆర్థికాభివృద్ధి కేవలం భౌతికమైన సహజ వనరులపైనే కాకుండా మానవ వనరుల మీద కూడా ఆధారపడుతుంది. దేశంలోని జనాభా, విద్యాప్రమాణాలు, ఆరోగ్యం, పౌష్టికాహారం, నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు, ఆదాయ పంపిణీ మొదలైనవి మానవ వనరుల కిందకే వస్తాయి. తక్కువ భూభాగం కలిగి ఎక్కువ జనాభాతో బాధపడే దేశాలు అభివృద్ధి సాధించలేవు. అధిక జనాభాతో బాధపడే దేశాల్లోని ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పించడం కూడా సమస్యే. ఈ కారణంగా దేశాలు వెనకబాటుకు లోనవుతాయి.

1. నిరుద్యోగం

జనాభా పెరుగుదలకు ఉద్యోగ అవకాశాలు చూపిచడం కష్టమవుతుంది. జనాభా పెరుగుతుంటే ఉద్యోగం లేనప్పుడు పేదరికం తప్పనిసరి పరిస్థితి అవుతుంది. ఒక ఉద్యోగానికి వేలల్లో దరఖాస్తుదారులుండటం.

2. ఆహార కొరత

జనాభా పెరుగుతున్న కొద్దీ ఆహారం కూడా పెరగాలి. కానీ, జనాభాతో పాటూ భూమి పెరగదు. కాబట్టి చాలినంత పంట పండదు. అందరూ సర్దుకుని తినాల్సిన పరిస్థితి వస్తుంది.

3. సాగు చేసే భూమి తగ్గుతుంది.

జనాభా పెరిగే కొద్దీ సాగు భూమి కొరత ఏర్పడుతుంది. సాగుభూమి తగ్గిపోతున్న కొద్దీ ఆహార కొరత ఏర్పడుతుంది. మోడర్న్ టెక్నాలజీ వలన వ్యవసాయంలో కూడా మెషీన్స్ వచ్చేయడంతో పని పెరిగే వీలుండదు.

4. పెట్టుబడి తగ్గుతుంది.

జనాభా పెరిగితే సంపాదన మీద ఆధారపడి బ్రతికేవారి సంఖ్య పెరుగుతుంది. దాంతో సంపాదించే వ్యక్తికి ఆ సంపాదనను ఎక్కడా ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది.

5. మామూలు అవసరాలు..

అవసరమైన కనీస అవసరాలు ప్రజలకు అందే వీలు కూడా తగ్గుతుంది. స్కూళ్ళూ, కాలేజీలు, ఆస్పత్రులు, అందుబాటులో ఉండవు.

6. వాతావరణం దెబ్బ తినే అవకాశం.

అధిక జనాభాతో నివాస భూమి తగ్గిపోయి కొండలు, అడవులు తరిగిపోయి నివాసాలుగా ఏర్పడతాయి. స్వచ్ఛమైన గాలి, నీరు అనేవి కలుషితం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

జనాభా పెరుగుదలతో ముఖ్యంగా మంచినీటి కోసం అల్లల్లాడిపోయే రోజులు రాబోతాయా. అవుననే అంటున్నారు నిపుణులు, ఆహార కొరతతో పాటు నీటి కొరత కూడా మెండుగా ఉంటుందనేది వారి మాట. రాబోయే తరాలకు నీటి ఇక్కట్లు తప్పవా? నీటిని పొదుపుగా వాడాలని నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి. దీనిలో భాగంగానే మరో సమస్య తలెత్తే అవకాశం ఉంది. అదే ఆహారం. ఆహారం సంవృద్ధిగా ఉంటేనే మనిషి జీవనం సరిగా సాగుతుంది. కుటుంబ నియంత్రణ విధానం పాటించినప్పటికీ జనాభా పెరుగుదల ఆగకపోవడం, చైనాను కూడా అధిగమించి భారత్ ముందు స్థానంలో ఉండటం అనేది రాబోవు రోజుల్లో జనాభా తీవ్ర పరిణామాలను ఎదుర్కొనే విధంగా చేస్తుందేది మాత్రం సత్యం.

Updated Date - 2023-01-19T14:49:01+05:30 IST