Tarakaratna : తాత మీద ప్రేమతో అలా...

ABN , First Publish Date - 2023-02-19T17:52:13+05:30 IST

నందమూరి తారకరత్న మరణంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనకు తాత ఎన్టీఆర్‌ అంటే చాలా ఇష్టం. అందుకు గుర్తుగానే తన పిల్లలకు తాత పేరు కలిసేలా పెట్టారు.

Tarakaratna : తాత మీద ప్రేమతో అలా...

నందమూరి తారకరత్న (tarakaratna)మరణంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనకు తాత ఎన్టీఆర్‌ అంటే చాలా ఇష్టం. అందుకు గుర్తుగానే తన పిల్లలకు తాత పేరు కలిసేలా పెట్టారు. తారకరత్న అలేఖ్యారెడ్డి దంపతులకు ముగ్గురు సంతానం. మొదటి పాప పేరు నిష్క. ఆ తర్వాత బాబు, పాప కవలలు. వీరికి తాన్యారామ్‌, రేయా అని పేర్లు పెట్టారు. ఈ ముగ్గురు పేర్లలో మొదటి ఇంగ్లిష్‌ అక్షరాలు... NTR (Nishka, Tanayram, Reya)గా రావడం గమనార్హం. తాత ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతో తన పిల్లకు ఈ విధంగా పేర్లు పెట్టారని తారకరత్న సన్నిహితులు చెబుతున్నారు.

Updated Date - 2023-02-19T17:52:15+05:30 IST