Singer Vani jayaram: వాణీ జయరామ్‌ కన్నుమూత!

ABN , First Publish Date - 2023-02-04T15:00:12+05:30 IST

ప్రముఖ గాయని వాణీ జయరామ్‌(78) (vani jayaram)ఇకలేరు. చెన్నైలోని తన స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. 1945 నవంబర్‌ 30న దురైస్వామి, పద్మావతి దంపతులకు వాణీ జయరామ్‌ జన్మించారు.

Singer Vani jayaram: వాణీ జయరామ్‌ కన్నుమూత!

ప్రముఖ గాయని వాణీ జయరామ్‌(Vani jayaram)(78) ఇకలేరు. చెన్నైలోని తన స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. 1945 నవంబర్‌ 30న దురైస్వామి, పద్మావతి దంపతులకు వాణీ (vani jayaram is no more)జయరామ్‌ జన్మించారు. తమిళనాడులోని వెల్లూరు ఈమె స్వస్థలం. ఆమె అసలు పేరు కలైవాణి(kalaivani). ఆరుగురు అక్కాచెల్లెళ్లలో వాణీ జయరాం ఐదో సంతానం. ఎనిమిదో సంవత్సరంలోనే సంగీత కచేరీ నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు. పదేళ్ల వయస్సులో మొదటిసారి ఆల్‌ ఇండియా రేడియాలో పాటలు ఆలపించారు. 1970లో ‘గుడ్డీ’ చిత్రం ద్వారా నేపథ్య గాయనిగా మారారు. మొదటి పాటకే తాన్‌సేన్‌తోపాటు మరో నాలుగు అవార్డులు అందుకున్నారు. (Vani jayaram is no more)

‘అభిమానవంతుడు’ చిత్రం ద్వారా గాయనిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. బాలచందర్‌ దర్శకత్వం వహించిన ‘అపూర్వ రాగంగళ్‌’ చిత్రానికి తొలిసారి జాతీయ పురస్కారం అందుకున్నారు. కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘శంకరాభరణం’ చిత్రంలోని మానస సంచరరే గీతానికి రెండోసారి జాతీయ పురస్కారం దక్కింది. ‘స్వాతికిరణం’లోని ‘ఆనతి నియ్యరా హరా పాటకు మూడోసారి ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు సొంతం చేసుకున్నారు వాణీ జయరామ్‌. హిందూస్థానీ క్లాసికల్‌ సింగింగ్‌లో ప్రావీణ్యం పొందిన వాణీ జయరామ్‌ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, భోజపురి, మరాఠీ, ఒరియా.. ఇలా 14 భాషల్లో పదివేలకుపైగా పాటలు పాడారు. కెవి.మహదేవన్‌, ఎం.ఎస్‌. విశ్వనాధన్‌, ఇళయరాజా, పెండాల్య, చక్రవర్తి, సాలూరి రాజేశ్వరరావు సంగీతంలో ఎక్కువ పాటలు పాడారు. సంగీత రంగానికి ఆమె చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మ భూషణ్‌ (Padma bhushan)అవార్డును ప్రకటించగా, అది అందుకోకుండగానే ఆమె కన్ను మూయడం బాధాకరం. వాణీ జయరామ్‌ మరణంతో సంగీతలోకం కన్నీరుమున్నీరైంది. సినీ ప్రముఖులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలుపుతున్నారు.

Updated Date - 2023-02-04T15:34:04+05:30 IST