Jamuna: ముగిసిన అంత్యక్రియలు

ABN , First Publish Date - 2023-01-27T18:39:32+05:30 IST

సీనియర్ నటి జమున (Jamuna) (86) జనవరి 27న కన్నుమూసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. తాజాగా ఆమె అంత్యక్రియలు మహాప్రస్థానంలో ముగిశాయి.

Jamuna: ముగిసిన అంత్యక్రియలు

సీనియర్ నటి జమున (Jamuna) (86) జనవరి 27న కన్నుమూసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. తాజాగా ఆమె అంత్యక్రియలు మహాప్రస్థానంలో ముగిశాయి. జమున కుమారుడు విదేశాల్లో నివసిస్తున్నారు. ఆయన రాక ఆలస్యం కానుండటంతో.. కుమార్తె స్రవంతిరావు తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ‘మా' అసోసియేషన్ సభ్యులు మాదాల రవి, కరాటే కల్యాణి, జీవిత తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. మంత్రి రోజా కూడా చివరి క్షణంలో వచ్చి నివాళులు అర్పించారు.

జమున 1936 ఆగస్ట్ 30న హంపిలో జన్మించారు. 1953లో ‘పుట్టిల్లు’ సినిమాతో వెండితెర పైకి రంగప్రవేశం చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించారు. సత్యభామ పాత్ర ఆమెకు ఎంతగానో గుర్తింపును తీసుకువచ్చింది. ‘మిస్సమ్మ’ (Missamma) జమున కెరీర్‌కు మంచి టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. తెలుగులో దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించారు. ‘సంతోషం’, ‘తెనాలి రామకృష్ణుడు’, ‘దొంగ రాముడు’, ‘బంగారు పాప’, ‘భూ కైలాస్‌’, ‘భాగ్య రేఖ’, ‘గుండమ్మకథ’ తోపాటు పలు హిట్‌ చిత్రాల్లో నటించారు. 2008లో ఎన్టీఆర్‌ నేషనల్‌ అవార్డును అందుకున్నారు. 1964, 1968లో ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు గెలుపొందారు.

Updated Date - 2023-01-27T18:50:26+05:30 IST