Ram Gopal Varma: ‘రాజమౌళి సెక్యూరిటీ పెంచుకోండి.. లేకపోతే చంపేస్తాం’.. తాగి ట్వీట్ చేసిన ఆర్జీవీ

ABN , First Publish Date - 2023-01-24T11:08:51+05:30 IST

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Ram Gopal Varma: ‘రాజమౌళి సెక్యూరిటీ పెంచుకోండి.. లేకపోతే చంపేస్తాం’.. తాగి ట్వీట్ చేసిన ఆర్జీవీ
RGV

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశంలోని ప్రతి అంశం మీద తనదైన శైలిలో స్పందిస్తుంటాడు. తాజాగా ఎస్‌ఎస్ రాజమౌళిపై ఆర్జీవీ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమా పలు అంతర్జాతీయ అవార్డులను సైతం అందుకుంది. ఇటీవలే ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది.

ఈ తరుణంలో ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని చూసి రాజమౌళిని ప్రశంసించాడు. అంతేకాకుండా కలిసి సినిమా చేద్దామనే ఆఫర్ కూడా ఇచ్చాడు ఈ ‘అవతార్’ డైరెక్టర్. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట హల్‌చల్ చేశాయి. వీటిపై తాజాగా ఆర్జీవీ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.

ఆర్జీవీ షేర్ చేసిన పోస్టులో.. ‘దాదా సాహబ్ ఫాల్కే నుండి ఇప్పటి వరకు భారతీయ సినిమా చరిత్రలో ఎస్ ఎస్ రాజమౌళితో కలుపుకుని ఎవరూ కూడా ఒక భారతీయ దర్శకుడికి ఇలాంటి అవకాశం వస్తుందని ఊహించి ఉండరు.

హే, రాజమౌళి మొఘల్ ఏ ఆజం తీసిన కాఆసిఫ్ నుంచి షోలే తీసిన రమేష్ సిప్పీ నుంచి ఆదిత్య చోప్రా, కరణ్ జోహార్లు, భన్సాలీ వంటి ఎంతోమందిని మీరు అధిగమించారు. అందుకే నేను మీ కాలి బొటనవేలును చప్పరించాలనుకుంటున్నాను’ అని రాసుకొచ్చాడు.

మరో ట్వీట్‌లో.. ‘సర్ రాజమౌళి, దయచేసి మీ భద్రతను పెంచుకోండి. ఎందుకంటే భారతదేశంలో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ మీ మీద అసూయతో ఉన్నారు. అందుకే మిమ్మల్ని చంపడానికి ఓ గ్రూప్‌నే ఏర్పాటు చేశారు. అందులో నేను కూడా భాగమే.. నేను 4 పెగ్గులు వేశాను. అందుకే ఈ రహస్యాన్ని బయటపెడుతున్నాను’ అని పేర్కొన్నాడు.

Updated Date - 2023-01-24T11:34:51+05:30 IST