OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN , First Publish Date - 2023-03-02T10:10:37+05:30 IST

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగిన సంగతి తెలిసిందే. థియేటర్‌‌లతో పోటీగా స్పెషల్ కంటెంట్‌తో దూసుకొస్తున్నాయి.

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..
ott

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగిన సంగతి తెలిసిందే. థియేటర్‌‌లతో పోటీగా స్పెషల్ కంటెంట్‌తో దూసుకొస్తున్నాయి. చాలా సినిమాలు థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్దిరోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ వినోదాన్ని పంచుతున్నాయి. ఈ తరుణంలో మార్చి 1న ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..

మేడ్ ఇన్ బెంగళూరు (Made in bengalore)

ముగ్గురు యువకుల జీవితాల చుట్టూ తిరుగే కథ 'మేడ్ ఇన్ బెంగళూరు'. సుహాస్, రాహుల్, న్యాన్ ఆ ముగ్గురి పేర్లు. వీరికి కార్పొరేట్ కార్యాలయాలలో పని చేయకుండా స్టార్టప్‌ను స్థాపించాలని అనుకుంటారు. ఈ తరుణంలో వారికి ఎదురయ్యే సంఘటనల సమాహారమే ఈ చిత్ర కథాశం. ప్రదీప్ శాస్త్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మధుసూదన్ గోవింద్, పునీత్ మాంజా, వంశీధర్, అనంత నాగ్, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Bengalore.jpg

హీట్ వేవ్ (Heatwave)

క్లైర్ చాలా టాలెంట్ అలాగే జీవితంలో లక్ష్యాలు ఉన్న యువతి. ఆమె విజయవంతమైన, బాగా ధనవంతుడైన వ్యాపారవేత్త వద్ద పనిచేయడం ప్రారంభిస్తుంది. కానీ తెలియకుండానే అతని భార్యకి దగ్గరై, అక్రమ సంబంధం కలిగి ఉంటుంది. దీన్ని వల్ల ఆమె జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. చివరకి తన ప్రాణాలు సైతం ప్రమాదంలో పడతాయి. ఆ సమస్యల నుంచి బయట పడి తన ప్రాణాలు ఎలా కాపాడుకుందనేది 'హీట్ వేవ్' కథాంశం. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

heatwave.jpg

నెట్ ఫ్లిక్స్ (Netflix)

Barbie: Skipper and The Big Babysitting Adventure - ఇంగ్లిష్

Cheat - ఇంగ్లిష్

Gecko's Garage 3D - ఇంగ్లిష్

Wrong Side of the Tracks Season 2 - ఇంగ్లిష్

Tonight You're Sleeping with Me - పోలిష్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney plus Hotstar)

The Mandalorian Season 3 - ఇంగ్లిష్

ఇవి కూడా చదవండి:

Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు

Madhuri Dixit: ‘ఆయనతో పెళ్లి చాలా కష్టం అనిపించింది.. అందుకే భాగస్వామి గురించి ముందే తెలుసుకోవాలి’

Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు

Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్

Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్

Updated Date - 2023-03-02T10:10:37+05:30 IST