Keerthy Suresh: షామియానాతో బట్టలు కుట్టించుకున్నావా?.. నటిపై ట్రోలింగ్

ABN , First Publish Date - 2023-02-02T11:43:23+05:30 IST

టాలీవుడ్‌తోపాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలు అన్నింటిలో మంచి పాపులారిటీ ఉన్న మలయాళీ భామ కీర్తి సురేశ్ (Keerthy Suresh). ‘నేను.. శైలజ’

Keerthy Suresh: షామియానాతో బట్టలు కుట్టించుకున్నావా?.. నటిపై ట్రోలింగ్
Keerthy Suresh

టాలీవుడ్‌తోపాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలు అన్నింటిలో మంచి పాపులారిటీ ఉన్న మలయాళీ భామ కీర్తి సురేశ్ (Keerthy Suresh). ‘నేను.. శైలజ’ (Nenu.. Shailaja) సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఈ బ్యూటీ అనంతరం వరుసగా స్టార్లతో సినిమాలు చేస్తూ అగ్రస్థానానికి చేరింది. నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’ (Mahanati) చిత్రంతో ఈ భామ క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. అయితే ఆ సినిమా తర్వాత ఈ తారకి సరైన హిట్ లేదనే చెప్పాలి. అయినప్పటికీ కీర్తి చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

అయితే.. . నితిన్, కీర్తి జంటగా ‘రంగ్ దే’ (Rang De) అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. ఈ యువ దర్శకుడు వివాహం పూజ అనే అమ్మాయితో తాజాగా జరిగింది. ఈ వేడుకకి టాలీవుడ్ నితిన్, కీర్తి సురేష్, డైరెక్టర్ వెంకీ కుడుముల, ప్రొడ్యూసర్ స్వప్న దత్ తదితరులు హాజరయ్యారు. వీటికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో అందరికంటే ఎక్కువగా ఆకర్షించిన విషయం.. కీర్తీ డ్రెస్సింగ్.

కీర్తి ధరించిన ఈ డ్రెస్స్‌లో పలు రంగులు కలిసి ఫంక్షన్లకి వాడే షామియానాలాగా ఉంది. దీంతో ఈ పిక్స్‌పై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు. ఈ వేడుకి సంబంధించిన ఓ కీర్తి పిక్‌ని షేర్ చేసి.. ‘మీ దుస్తువులను షామియానాతో కుట్టిస్తే ఇలాగే ఉంటుంది’ అని రాసుకొచ్చాడు. దీంతో.. ‘అవును మాకు అలాగే అనిపిస్తోంది’.. ‘నాకు షామియానా అంటే ఇష్టం.. ఈ షామియానా బేబీ అన్న చాలా ఇష్టం’ అని రాసుకొస్తున్నారు.

Updated Date - 2023-02-02T11:43:25+05:30 IST