Nawazuddin Siddiqui: భార్య వల్ల ఇంటికి దూరంగా ఉంటున్న నటుడు!

ABN , First Publish Date - 2023-02-06T15:13:50+05:30 IST

బాలీవుడ్‌లోని విలక్షణ నటుల్లో నవాజుద్దీన్ సిద్దిఖీ (Nawazuddin Siddiqui) ఒకరు. ‘బజరంగీ భాయిజాన్’, ‘బద్లాపూర్’ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్నారు. నవాజ్ గతేడాది ముంబైలో తన కలల సౌధాన్ని నిర్మించుకున్నారు.

Nawazuddin Siddiqui: భార్య వల్ల ఇంటికి దూరంగా ఉంటున్న నటుడు!

బాలీవుడ్‌లోని విలక్షణ నటుల్లో నవాజుద్దీన్ సిద్దిఖీ (Nawazuddin Siddiqui) ఒకరు. ‘బజరంగీ భాయిజాన్’, ‘బద్లాపూర్’ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్నారు. నవాజ్ గతేడాది ముంబైలో తన కలల సౌధాన్ని నిర్మించుకున్నారు. తన తండ్రికి గుర్తుగా ఆ ఇంటికి నవాబ్ అని పేరు పెట్టారు. చాల చిత్రాల్లో నటిస్తే వచ్చిన డబ్బుతో ఈ భవనాన్ని నిర్మించుకున్నానని తెలిపారు. ఈ ఇంటిలో ఆరు బెడ్ రూమ్‌లు, రెండు పెద్ద గదులు, రెండు లాన్‌లు ఉన్నాయి. ఇంటిలోని ప్రతి ఇంచును తన అభిరుచికి అనుగుణంగా కట్టించుకున్నారు. అంధేరీలోని యారీ రోడ్‌లో ఈ ఇల్లు ఉంది. ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఈ ఇంటికి తన భార్య వల్ల నటుడు దూరంగా ఉండాల్సి వస్తుంది.

నవాజుద్దీన్ సిద్దిఖీ తల్లి మెహ్రున్సిసా సిద్దిఖీ, భార్య ఆలియాకు మధ్య ఆస్తిపాస్తుల విషయంలో విభేదాలు తలెత్తాయి. వాగ్యుద్ధానికి దిగారు. ఫలితంగా ఇద్దరు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఒక్కరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆలియా పలు ఆరోపణలు గుప్పించారు. తనను బెడ్ రూమ్‌తో పాటు ఇతర ప్రైవేటు స్థలాల్లో బంధించారని తెలిపారు. సోఫాల్లో తాత్కాలిక జీవితం గడిపేలా చేశారని పేర్కొన్నారు. ఆలియా చేసిన ఆరోపణలతో పోలీసులు, లాయర్స్ నవాజ్ ఇంటిని చుట్టుముట్టారు. ఆయనను ప్రశ్నించడానికి ప్రయత్నించగా అందుబాటులో లేరని తెలుస్తోంది. ప్రస్తుతం హోటల్‌లో నివాసముంటున్నారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. తన న్యాయవాదులు సమస్యను పరిష్కరించే వరకు ఇంటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని సమాచారం అందుతుంది. నవాజుద్దీన్ సిద్దిఖీకీ ఆలియా (Alia) రెండో భార్య. ఈ జంట 2010లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఏమైందో తెలియదు కానీ వీరి దాంపత్య జీవితంలో విభేదాలు తలెత్తాయి. విడిపోవాలని నిర్ణయించుకున్నారు.

Updated Date - 2023-02-06T15:16:18+05:30 IST