AmigosTrailer: ఇండియన్ పాబ్లో ఎస్కోబార్.. నేషనల్ సెక్యూరిటీకి వణుకు పుట్టించిన వ్యక్తి

ABN , First Publish Date - 2023-02-03T19:23:46+05:30 IST

నందమూరి కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా నటించిన సినిమా ‘అమిగోస్’ (Amigos). రాజేంద్ర రెడ్డి (Rajendra Reddy) దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ త్రి పాత్రాభినయం పోషించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 10న విడుదల కానుంది.

 AmigosTrailer: ఇండియన్ పాబ్లో ఎస్కోబార్.. నేషనల్ సెక్యూరిటీకి వణుకు పుట్టించిన వ్యక్తి

నందమూరి కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా నటించిన సినిమా ‘అమిగోస్’ (Amigos). రాజేంద్ర రెడ్డి (Rajendra Reddy) దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ త్రి పాత్రాభినయం పోషించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. అందులో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది.

ఇండియన్ పాబ్లో ఎస్కో బార్, నేషనల్ సెక్యూరిటీకి పీడ కలలా మారిన వ్యక్తి.. డైలాగ్స్‌తో కల్యాణ్ రామ్ పాత్రను పరిచయం చేశారు. మరో పాత్రను ప్రేమికుడిగా చూపించారు. అదే సమయంలో ఈ ప్రేమికుడికి కల్యాణ్ రామ్‌ను పోలీన వ్యక్తి ఎదురుపడతారు. ఈ మూడు పాత్రలు ఒకరికి మరొకరు ఎదురైనప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి..? వీరి మధ్య సంబంధం ఏంటీ అనేది సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. బాలకృష్ణ ‘ఎన్నో రాత్రులోస్తాయి’ సాంగ్‌ను ఈ మూవీలో రీమేక్ చేశారు. ఈ పాట ఇప్పటికే సినిమాపై అంచనాలను పెంచేసింది. ‘అమిగోస్’ ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవిన్ యెర్నెనీ, యలమంచిలి రవిశంకర్ నిర్మించారు. జిబ్రాన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) హీరోయిన్ పాత్రను పోషించారు. బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated Date - 2023-02-03T19:23:47+05:30 IST