Mahesh-Suhas: ప్రశంసలతో ఉక్కిరిబిక్కిరి

ABN , First Publish Date - 2023-02-06T17:00:20+05:30 IST

ప్రశంసలతో ఉక్కిరిబిక్కిరి

Mahesh-Suhas: ప్రశంసలతో ఉక్కిరిబిక్కిరి

‘కలర్‌ ఫొటో’ ఫేం సుహాస్‌ కథానాయకుడిగా నటించిన ‘రైటర్‌ పద్మభూషణ్‌’(writer padmabhushan) చిత్రం ఇటీవల విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. బడ్జెట్‌ సినిమా అయినా కథలో చక్కని సందేశం ఉండడంతో అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి స్పందన బావుంది. సోమవారం ఈ చిత్రాన్ని వీక్షించిన సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు (mahesh babu wathed Writer padmabhushan) ప్రశంసల వర్షం కురిపించారు. సినిమాను పూర్తిగా ఎంజాయ్‌ చేశానని.. సుహాస్‌ నటన చాలా బాగుందని అన్నారు. దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్‌ తెరకెక్కించిన తీరు, నిర్మాతలు శరత్‌చంద్ర, అనురాగ్‌రెడ్డి కృషిని ప్రశంసించారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా మహేశ్‌ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ‘‘రైటర్‌ పద్మభూషణ్‌ సినిమాను చాలా ఎంజాయ్‌ చేశా. హార్ట్‌ టచింగ్‌గా ఉంది. క్లైమాక్స్‌ అదిరిపోయింది. ఫ్యామిలీతో తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ఇది’’ అని పోస్ట్‌ చేశారు. హీరో సుహాస్‌, దర్శకుడు, నిర్మాతలతో కలిసి ఉన్న ఫోటోని మహేశ్‌ బాబు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. మహేశ్‌ ప్రశంసలకు సుహాస్‌ (suhas)ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. ఆ ఆనందకర క్షణాలను తట్టుకోలేక ఏడ్చేశాడు.

Updated Date - 2023-02-06T17:00:21+05:30 IST