Saindhav: వైవిధ్య నటుడి టాలీవుడ్ ఎంట్రీ

ABN , First Publish Date - 2023-01-26T15:59:32+05:30 IST

కొత్త రకం పాత్రలు, వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ (Nawazuddin Siddiqui). ‘బజరంగీ భాయిజాన్’, ‘రమణ్ రాఘవ్ 2.0’, ‘బద్లాపూర్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.

Saindhav: వైవిధ్య నటుడి టాలీవుడ్ ఎంట్రీ

కొత్త రకం పాత్రలు, వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ (Nawazuddin Siddiqui). ‘బజరంగీ భాయిజాన్’, ‘రమణ్ రాఘవ్ 2.0’, ‘బద్లాపూర్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ వైవిధ్య నటుడు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో వెంకటేశ్ (Venkatesh) ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘సైంధవ్’ (Saindhav) అని టైటిల్ పెట్టారు. ఈ మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. నిహారిక ఎంటర్ టైన్‌మెంట్స్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియాగా రూపొందిస్తుంది. ఈ సినిమాతోనే నవాజుద్దీన్ సిద్దిఖీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఓ కీలక పాత్రను పోషించనున్నారని పేర్కొంటూ చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ‘‘టాలీవుడ్ ఫిలిం హిస్టరీలోనే తొలిసారి. ఇండియాలోనే మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీకి ‘సైంధవ్’ లోకి స్వాగతం చెబుుతున్నందుకు గర్వంగా ఉంది. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తాం’’ అని చిత్ర బృందం పేర్కొంది. నవాజుద్దీన్ ఈ సినిమాలో నటిస్తుండటంతో డైరెక్టర్ శైలేష్ కొలను కూడా సంతోషం వ్యక్తం చేశారు. ‘సైంధవ్’ లో వెంకటేశ్ ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ లుక్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

Updated Date - 2023-01-26T16:02:09+05:30 IST