Vani Jayaram: వాణీ జయరాం మృతిపై షాకింగ్ ట్విస్ట్.. పని మనిషి ఏం చెప్పిందంటే..

ABN , First Publish Date - 2023-02-04T17:17:41+05:30 IST

ప్రముఖ నేపథ్య గాయని, అలనాటి మేటి సింగర్ వాణీ జయరాం (Vani Jayaram) మృతిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అపార్ట్‌మెంట్‌లో విగత జీవిగా ఆమె పడి ఉన్న తీరు, ఆమె ముఖంపై..

Vani Jayaram: వాణీ జయరాం మృతిపై షాకింగ్ ట్విస్ట్.. పని మనిషి ఏం చెప్పిందంటే..

ప్రముఖ నేపథ్య గాయని, అలనాటి మేటి సింగర్ వాణీ జయరాం (Vani Jayaram) మృతిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అపార్ట్‌మెంట్‌లో విగత జీవిగా ఆమె పడి ఉన్న తీరు, ఆమె ముఖంపై కనిపిస్తున్న గాయాలు కలకలం రేపుతున్నాయి. అసలేం జరిగిందంటే.. రోజూలానే ఆమె ఇంట్లో పని మనిషిగా చేస్తున్న మహిళ శనివారం కూడా వాణీ జయరాం ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు (Vani Jayaram House) వెళ్లింది. ఇంట్లోకి వెళ్లేందుకు కాలింగ్ బెల్ ప్రెస్ చేసింది. ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా తలుపు తీయలేదు. దీంతో.. కంగారుపడిన పనిమనిషి వాణీ జయరాం బంధువులకు (Vani Jayaram Chennai House) సమాచారం అందించింది. ఆ బంధువులు పోలీసులకు సమాచారం అందించారు.

Vani-Jayaram1.jpg

పోలీసులు డోర్‌ను బద్ధలు కొట్టి చూడగా ముఖంపై తీవ్ర గాయాలతో నట్టింట్లో ముఖంపై తీవ్ర గాయాలతో విగత జీవిగా వాణీజయరాం పడి ఉన్నారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాణీ జయరాం భర్త జయరాం 2018లో చనిపోవడం, వారికి పిల్లలు కూడా లేకపోవడంతో ఆమె ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నారు. రోజూ వచ్చే పని మనిషి సాయంగా ఉండేది. పని పూర్తయ్యాక వెళ్లిపోయేది. ఇవాళ కూడా రోజూ వెళ్లినట్టే వాణీజయరాం ఇంటికి వెళ్లగా ఈ ఘటన వెలుగుచూసింది.

అసలేం జరిగిందంటే..

* వాణీజయరామ్‌ నుదురు, ముఖంపై గాయాలు ఉన్నాయి: పనిమనిషి

* పోలీసులకు సమాచారం ఇచ్చి.. ఆస్పత్రికి తరలించిన పనిమనిషి

* ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి ప్రాణాలు కోల్పోయిందన్న వైద్యులు

* అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన చెన్నై పోలీసులు

* వాణీజయరామ్‌ ఇంటిని ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు

* సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలిస్తున్న చెన్నై పోలీసులు

వాణీ జయరాం సింగింగ్ కెరీర్ గురించి విశేషాలివి..

* వాణీజయరామ్‌ అసలు పేరు కలైవాణి

* వివిధ భాషల్లో 20 వేలకుపైగా పాటలు పాడిన వాణీజయరామ్

* ఇటీవల వాణీజయరామ్కు పద్మభూషణ్ ప్రకటించిన కేంద్రం

* 1971లో నేపథ్య గాయనిగా వాణీజయరామ్‌ సినీరంగ ప్రవేశం

* 3 సార్లు జాతీయ ఉత్తమ గాయనిగా అవార్డు అందుకున్న వాణి

* కర్నాటక, హిందుస్తానీ సంగీతంలో నైపుణ్యం

* 8వ ఏటనే ఆలిండియా రేడియోలో ప్రదర్శనలు

* 19 భాషాల్లో పాటలు పాడిన వాణీజయరామ్‌

* ‘బోలే రే పపీ హరా’ పాటతో నేపథ్య గాయకురాలిగా ప్రవేశం

* హిందీ సినిమా 'గుడ్డి' ద్వారా సినీరంగంలోకి ప్రవేశం

* పలు భాషల్లో భక్తీ గీతాలు ఆలపించిన వాణిజయరామ్‌

Updated Date - 2023-02-04T17:54:03+05:30 IST