Ilayaraja live concert Highlights: ఇలాంటి పాటల రాత్రులు మళ్లీ మళ్లీ రావాలి!

ABN , First Publish Date - 2023-02-27T17:38:20+05:30 IST

‘రాజా.. రాజాది రాజాది... రాజా.. (Raja Rajadi raja) పూజా.. చెయ్యాలి కుర్రకారు పూజ’ ఈ పాట వినగానే కుర్రకారుకి పూనకాలొచ్చాయి. (Ilayaraja live concert hydrabad Highlights) మాటే మంత్రము.. మనసే బంధము... (mate mantramu) ప్రేమపావురాలు ఊహల్లోకి వెళ్లిపోయారు..

Ilayaraja live concert Highlights: ఇలాంటి పాటల రాత్రులు మళ్లీ మళ్లీ రావాలి!

‘రాజా.. రాజాది రాజాది... రాజా.. (Raja Rajadi raja)

పూజా.. చెయ్యాలి కుర్రకారు పూజ’

ఈ పాట వినగానే కుర్రకారుకి పూనకాలొచ్చాయి.

(Ilayaraja live concert hydrabad Highlights)

మాటే మంత్రము.. మనసే బంధము... (mate mantramu)

ప్రేమపావురాలు ఊహల్లోకి వెళ్లిపోయారు..

ఆకాశం ఏనాటితో... అనురాగం ఆనాటిది.. (aakasam yenatido)

ఎన్నో రాత్రులొస్తాయి కానీ.. రాదు వెన్నెలమ్మా... (Enno rathrulostayi kani..)

అంటే.. ఆహుతులు ప్రేమను ఫీలయ్యారు...

ఆడజన్మకు ఎన్ని శోకాలో... అనగానే

భావోద్వేగంతో కన్నీరుమన్నీరయ్యారు...

ఇదీ స్వర మాంత్రికుడు ఇళయరాజా (Ilayaraja) మ్యూజికల్‌ మ్యాజిక్‌. ఆయన సంగీతంతో ఎలాంటి భావోద్వేగాలైనా పలికించగలరు. ఆ అనుభూతిని ఐదేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఐదేళ్ల తర్వాత ఆయన హైదరాబాద్‌లో లైవ్‌ షో చేశారు. శని, ఆదివారాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గచ్చిబౌలి స్టేడియం వేదికైంది. సినీతారలను, వేలాది మంది సంగీత ప్రియులను, ఇళయారాజా అభిమానులను ఒక చోటుకు చేర్చింది ఈ లైవ్‌ కాన్సెర్ట్‌. మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌తో లైవ్‌ షో ప్రారంభించారు. ఇళయరాజా గానంలో ‘జననీ జననీ’ పాటతో మ్యూజికల్‌ ట్రీట్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. ‘ఎన్నో రాత్రులోస్తాయిగానీ’, ‘కలయా నిజమా’, ‘మాటే మంత్రము’ పాటలను ఇళయరాజా స్వయంగా అలపించి యువతలో ఉత్సాహాన్ని పెంచారు. తన బృందంతో 35కు పైగా పాటల్ని ఆలపించి ఆహుతులకు కొత్త అనుభూతిని కలిగించారు. కార్తిక్‌ పాడిన ఓం శివోహం పాట ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని తెచ్చింది. అయితే ఎక్కడా రీ టేకులు తీసుకోకుండా అపశ్రుతులు దొర్లకుండా లైవ్‌ షో ని కండక్ట్‌ చేయడంలో ఇళయరాజా తన మార్క్‌ చూపించారు. మనో, ఎస్పీ చరణ్‌.. బాలు లేని లోటుని కనిపించకుండా శక్తి మేరకు ప్రయత్నించారు. లేడీ సింగర్స్‌ సునీత, శ్వేత, శిరీషా, విభావరి, అనిత మధుర గానంతో అలరించారు. ఇళయారాజాను అభిమానించే వారిగా ఈ షోలో పాల్గొన్న దర్శకుడు హరీశ్‌ శంకర్‌, మంచు లక్ష్మీ, ఈషా రెబ్బ తదితరులు ‘సింగారాల పైరుల్లోన’ పాటకు వేదిక ముందు స్టెప్పులేసి సందడి చేశారు.

Ilaya.jpg

కళాతపస్వీకి అంజలి.. (K Vishwanath Condolence)

లైవ్‌ షో లో కళాతపస్వి కె విశ్వనాథ్‌కి అంజలి ఘటించారు ఇళయరాజా. ‘వేదం అణువణువున’, ‘తకిట తదిమి తందాన, మౌనమేలనోయి, లాలి లాలి పాటలతో కె విశ్వనాథ్‌ కి నివాళి అర్పించారు.

అలా ఎవరూ లేరు.. (maestro ilayaraja)

ఇళయరాజాని మ్యూజికల్‌ గాడ్‌ అంటారు. ఆయన స్వరపరిచిన పాటల్లో ఎదో మహత్తు ఉంటుంది. పాట పాతదే అయినా, అది వచ్చిన ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికి అదే ఫీల్‌, ఫ్రెష్‌నెస్‌ ఉంటుంది. ఎన్నిసార్లు విన్నా అదే మ్యాజిక్‌, ఎమోషన్‌ కనెక్ట్‌ అవుతుంది. ఒక పాట తయారీ వెనుక ఎలాంటి శ్రమ వుంటుంది? ఎంత సృజన అవసరమో .. ‘ఓ ప్రియ ప్రియా’ పాటను ఎలా క్రియేట్‌ చేశారోచ బలపం పట్టి భామ ఒళ్లో పాటను వేటురి ఎలా రాశారో చెప్పుకొచ్చారు రాజా. ఒక పాట క్రియేషన్‌కి ఎన్ని లేయర్లలో వర్క్‌ జరుగుతుందో చెప్పి.. ఇలా సంగీతాన్ని ప్రేక్షకులకు చెప్పే సంగీత దర్శకుడు ఎవరైనా వున్నారా? అని ప్రశ్నించి.. ‘ఎవరు లేరు.. నేను మాత్రమే ఇలా చెప్తాను’ అని సమాధానమిచ్చారు. దాంతో మైదానంలో చప్పట్లు మారుమ్రోగాయి. 80 ఏళ్ల వయసులో మూడున్నర గంటల షోలో ఒక్క సెకన్‌ కూడా కూర్చుకుండా ఆయన లైవ్‌ కండక్ట్‌ చేయడం అందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది.

olaya-2.jpg

ఎస్‌.పి బాలు లేని లోటు... (Sp balu)

ఇళయరాజా లైవ్‌ షోలో బాలు ఉంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. పాటలతో పాటు సరదా కబుర్లు పంచుకునేవారు. ఇళయరాజాని.. ఏరా అని పిలిచే చనువు బాలుకు ఉంది. ఇళయరాజా మ్యూజిక్‌ గ్రేట్‌ నెస్‌ బాలు చెబుతుంటే ఆ మ్యాజిక్‌ వేరుగా వుంటుంది. పాట మధ్యలో వెరైటీ ప్రయోగాలు చేసి ఆహుతులను అలరించేవారు. అయితే అది ఈ షోలో మిస్‌ అయ్యింది. పాటల వెనుక ఉన్న కబుర్లు చెప్పే మనిషి కనిపించలేదు. దాంతో ఇళయారాజనే తన పాటల గురించి వివరించి అందులోని స్పెషాలిటీ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ షో మొత్తంలో ఎక్కువ బాలు పాడిన పాటల్నే పాడారు. ఎస్పీ చరణ్‌, మనో, కార్తిక్‌ చక్కగా ఆలపించారు. అక్కడక్కడా బాలు వాయిస్‌ని మిస్‌ అయిన ఫీలింగ్‌ ప్రేక్షకులకు కలిగింది. ‘జగదానంద కారక’, ‘ఆమని పాడవే కోయిలా’, ‘హలో గురూ ప్రేమ కోసమే’, ‘సువ్వీ సువ్వి సువ్వాలమ్మా, ‘ప్రేమ ఎంత మధురం’, ‘వేదం అణువణువున’, ‘యమహో నీ యమ యమ అందం’, ‘మాటరాని మౌనమిది’, ‘అబ్బనీ తీయని దెబ్బ’, ‘జగడ జగడ జగడం’ వేదికపై ఈ పాటలు పాడుతున్నంత సేపు బాలునే గుర్తు చేసుకున్నారు సంగీత ప్రియులు.

Devi.jpg

దేవిశ్రీ ప్రసాద్‌కు అవకాశం.. (Devisri prasad Fan moment)

దేవిశ్రీ ప్రసాద్‌ ఇళయరాజకి పెద్ద అభిమాని. ఆయన లైవ్‌ షో ఎక్కడున్నా రెక్కలు కట్టుకొని వాలిపోతాడు. గచ్చిబౌలి ేస్టడియంలో కూడా దేవిశ్రీ సందడి కనిపించిది. షోలో పాడిన ప్రతి పాటకు పరవశించిపోయాడు. ‘జగడ జగడ జగడం’ పాట వచ్చినప్పుడు అయితే కూర్చున్న చోటే డ్యాన్స్‌ చేశారు. ఉన్నట్లుండి దేవీని ేస్టజ్‌ మీదకి ఆహ్వానించారు. ‘’మీ పాటకి మా మనసులు, ప్రాణాలు, జీవితాలే ఊగుతున్నాయి సర్‌. రాజా గారికి దేశం, భాషతో పనిలేదు. ఆయన మన మనసులో నిండిపోయారు’’ అని దేవిశ్రీ ప్రసాద్‌ అన్నారు. వేల సంఖ్యలో హాజరైన సంగీత అభిమానులు తాము అభిమానించే స్వరకర్తని ప్రత్యక్షంగా చూసి ‘ఇలాంటి పాటల రాత్రులు మళ్లీ మళ్లీ రావాలి’ అనేంతగా ఎంజాయ్‌ చేశారు.

Updated Date - 2023-02-27T17:51:05+05:30 IST