IAS Officer Anju Sharma Success Story : ఆమె టెన్త్, ఇంటర్ ఫెయిల్... ఇక ‘సరిసర్లే’ అనుకున్నరంతా... ఇంతలోనే మైండ్ దిమ్మతిరిగిపోయేలా ఆమె ఏం చేసిందంటే...

ABN , First Publish Date - 2023-03-05T07:01:30+05:30 IST

యూపీఎస్సీ పరీక్ష దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటి. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అమితమైన కృషి, అంకితభావం, సహనం, పట్టదల అవసరం.

IAS Officer Anju Sharma Success Story : ఆమె టెన్త్, ఇంటర్ ఫెయిల్... ఇక ‘సరిసర్లే’ అనుకున్నరంతా... ఇంతలోనే మైండ్ దిమ్మతిరిగిపోయేలా ఆమె ఏం చేసిందంటే...

యూపీఎస్సీ పరీక్ష దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటి. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అమితమైన కృషి, అంకితభావం, సహనం, పట్టదల అవసరం. యూపీఎస్సీ పాస్ కావాలని అందరూ అనుకుంటారు. అయితే కొందరు మాత్రమే దీనిలో విజయం సాధిస్తారు. కేవలం 22 సంవత్సరాల వయస్సులో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అధికారిగా మారిన ఒక స్ఫూర్తిదాయకురాలి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆమె 12వ తరగతిలో ఎకనామిక్స్ పేపర్‌లో ఫెయిల్ అయ్యారు. అంతకుముందు 10వ తరగతిలో ప్రీ-బోర్డ్ కెమిస్ట్రీలో కూడా ఫెయిల్ అయ్యారు. ఈ రెండు సబ్జెక్టులు మినహా మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో డిస్టింక్షన్‌తో ఉత్తీర్ణత సాధించడం విశేషం. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, అయితే తన తల్లి తనకు అండగా నిలిచి అన్ని కష్ట సమయాల్లో తనను ప్రేరరణగా నిలిచారని అంజు శర్మ తెలిపారు.

12వ తరగతిలో ఎకనామిక్స్ ఫెయిల్ కావడానికి చివరి నిముషంలో ప్రిపేర్ కావడమే తాను చేసిన తప్పిదమని అంజుశర్మ తెలిపారు. దీనిని గుణపాఠంగా మలచుకున్న తాను కాలేజీ పరీక్షలకు ముందుగానే ప్రిపేర్ అయ్యానని తెలిపారు. ఫలితంగా ఆమె కాలేజీ చదువులో గోల్డ్ మెడల్ సాధించారు. అంజుశర్మ రాజస్థాన్‌లోని జైపూర్ లో BSC, MBA పూర్తిచేశారు. పక్కాప్రణాళికతో ఆమె మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించారు. ఐఎఎస్ టాపర్ల జాబితాలో చేరారు.

Updated Date - 2023-03-06T16:47:50+05:30 IST