Share News

Horoscope: రాశిఫలాలు

ABN , First Publish Date - 2023-12-11T07:41:44+05:30 IST

నేడు (11-12-2023 - సోమవారం) మేష రాశి వారు ప్రియతముల కోసం విలువైన వస్తువుల సేకరిస్తారు. వేడుకలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. సింహరాశి వారు రియల్‌ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు, హార్డ్‌వేర్‌ వ్యాపారులు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి.

Horoscope: రాశిఫలాలు

నేడు (11-12-2023 - సోమవారం) మేష రాశి వారు ప్రియతముల కోసం విలువైన వస్తువుల సేకరిస్తారు. వేడుకలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. సింహరాశి వారు రియల్‌ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు, హార్డ్‌వేర్‌ వ్యాపారులు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వృశ్చిక రాశి వారు పెట్టుబడుల, ఇతర ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్ణయాలకు తగిన సమయం కాదు. ఇక అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

రుణాలు, పెట్టుబడులకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపాలి. ఇన్సూరెన్స్‌, పెన్షన్‌కు సంబంధించిన పత్రాలు సేకరిస్తారు. పన్నుల వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది.

MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ప్రియతముల కోసం విలువైన వస్తువుల సేకరిస్తారు. వేడుకలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. షేర్‌మార్కెట్‌ లావాదేవీలు, ఇతర పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. భాగస్వామి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. శివారాధన శుభప్రదం.

MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. విందు వినోదాల్లో పరిమితులు పాటించాలి. చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రత్యర్థుల నుంచి అనుకోని చిక్కులు తలెత్తుతాయి. రుద్రకవచపారాయణ శుభప్రదం.

MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. పొదుపు పథకాలపై ఆశించిన ప్రతిఫలం రావడం కష్ట సాధ్యం. ప్రియతముల ఆరోగ్యం కలవరం కలిగిస్తుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడంతో నిరుత్సాహపడతారు. శివాలయ దర్శనం శుభప్రదం.

MESHAM-05.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. రియల్‌ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు, హార్డ్‌వేర్‌ వ్యాపారులు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వేడుకలకు ఏర్పాట్లలో చిక్కులు ఎదురవుతాయి. శివ పంచాక్షరిని జపించడం శుభప్రదం.

MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

తోబుట్టువుల వ్యవహరాల్లో మాటపడాల్సి రావచ్చు. ఇంటికి అవసరమైన వస్తువుల రవాణా చేసుకుంటారు. రిజిస్ట్రేషన్లు, భూమి పత్రాలు రూపొందించడంలో పొరపాట్లు దొర్లే అవకాశం ఉంది. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. అన్నదానం శుభప్రదం.

MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

బిల్లులు, చెక్కులు, విలువైన పత్రాలు సకాలంలో అందకపోవడంతో నష్టపోయే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో సన్నిహితులు మొహబాటపెడతారు. ఆర్థికపరమైన చర్చల్లో ఆశించన ప్రయోజనం కనిపించదు. శ్రీ రుద్రకవచ పారాయణ శుభప్రదం.

MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడుల, ఇతర ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్ణయాలకు తగిన సమయం కాదు. షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో మీ ఆలోచనలు భిన్నమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి.

MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో మీ సంకల్ప సాధనకు అధికంగా శ్రమించాలి. సినీ, రాజకీయ రంగాల వారు తొందరపాటు నిర్ణయాల కారణంగా నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. మనశ్శాంతి లోపిస్తుంది. గోసేవ శుభప్రదం.

MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

బృందకార్యక్రమాల్లో మాటపడాల్సి రావచ్చు. విలువైన వస్తువులు కనిపించుకుండా పోయే ప్రమాదం ఉంది. ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. బంధుమిత్రుల కోసం ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. శ్రీ రుద్రకవచ పారాయణ శుభప్రదం.

MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికంగా కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉన్నత పదవుల కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోచ్చు. పైఅధికారుల నుంచి మాటపడాల్సి వస్తుంది. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లోపిస్తుంది. శివారాధన శుభప్రదం.

MESHAM-FINAL-12.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

రాజకీయ, న్యాయ, బోధన, కళా రంగాల వారికి కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అంచనాలు తప్పే అవకాశం ఉంది. హామీలు నెరవేర్చలేకపోవడంతో పెద్దల నుంచి మాటపడాల్సి వస్తుంది. శ్రీ రుద్రకవచ పారాయణ శుభప్రదం.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - 2023-12-11T07:45:13+05:30 IST