Holi celebration: లాఠీ పట్టుకునే పోలీసు ఇక్కడ రంగులు పూసుకుని.., చిందులేస్తాడు..!

ABN , First Publish Date - 2023-03-08T08:13:59+05:30 IST

రాధా కృష్ణల ప్రతిమలతో ప్రజలు భండారిపోఖారి పోలీస్ స్టేషన్ వైపు కవాతు చేస్తారు.

Holi celebration: లాఠీ పట్టుకునే పోలీసు ఇక్కడ రంగులు పూసుకుని.., చిందులేస్తాడు..!
Holi celebration

హోలీ పండుగ అంటే సరదాలను పంచే సంబరం. రంగురంగుల పండుగ. దేశవ్యాప్తంగా హోలీని చాలా వైభవంగా జరుపుకుంటాము. అయితే ఒడిశా గ్రామం లో హోలీ రెండు రోజుల ముందు నుంచే ప్రారంభం అవుతుంది. భద్రకా జిల్లాలోని భండారిపోఖారి నివాసితులు రంగుల పండుగను ప్రత్యేకమైన సంప్రదాయంతో జరుపుకుంటారు. ఈ హోలీ పండుగ మరీ ప్రత్యేకంగా మారడానికి కారణం ఏమిటంటే..

అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రామం ప్రజలు ఇక్కడ స్థానిక పోలీసులతో కలసి హోలీ జరుపుకుంటారు. ఈ పండుగరోజున పోలీసులు రంగులు, పానీయాలు, రకరకాల స్వీట్స్, ఆహారాలతో సంబరాలను జరుపుకుంటారు. అందుకే ఎక్కడా లేని విధంగా హోలీని పండుగను రెండురోజుల పాటు జరుపుకుంటారు. ఈ సంప్రదాయాన్ని 'మున్సి మెలనా' అని పిలుస్తారు. ఇది గత 80 సంవత్సరాలుగా గ్రామంలో జరుపుకుంటున్న పండుగ.

ఇక్కడి కథనం ప్రకారం బ్రిటిష్ పాలనలో ఇక్కడి ప్రజలు అమానవీయ హింసలను భరించారు. చిత్రహింసలు ఎంత తీవ్రంగా మారాయి అంటే ఒకరోజు ప్రజలు స్థానిక పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టారు. దీంతో ఇక్కడి పోలీసులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానిక ప్రజలు, పోలీసుల మధ్య సోదరభావం, స్నేహాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నంలో, అప్పుడు భండారిపోఖారి IIC బాబులాల్ మున్సీ ఈ 'మెలనా'ను ప్రారంభించారు, ఇది సంవత్సరాలుగా పండుగగా మారింది. అందుకు గుర్తుగానే ప్రతి సంవత్సరం ఈ పండుగను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం, రాధా కృష్ణల ప్రతిమలతో ప్రజలు భండారిపోఖారి పోలీస్ స్టేషన్ వైపు కవాతు చేస్తారు. భండారిపోఖారి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత, ప్రజలు మొదట పోలీసు సిబ్బంది అందరి ముఖాలపై రంగులు అద్ది, ఆపై రెండు రోజుల వేడుకను ప్రారంభిస్తారు.

పోలీస్ స్టేషన్ సమీపంలో నృత్య కార్యక్రమాలు, సంగీతం, స్వీట్ల పంపిణీ జరుగుతుంది. మిఠాయిలు కూడా తయారు చేసి స్థానికులకు పంచుతారు. చాలా సందర్భాలలో, సాధారణ ప్రజలు పోలీసు స్టేషన్‌లకు రావడానికి, సహాయం కోరడానికి భయపడతారు. కాబట్టి, ఈ ప్రత్యేకమైన పండుగ ఆ భయాన్ని తొలగించి, సామాన్య ప్రజలు, పోలీసుల మధ్య బంధాన్ని ఏర్పరచడానికి ఒక అడుగులాంటిదని, ఇక్కడివారు నమ్ముతారు.

Updated Date - 2023-03-08T08:13:59+05:30 IST