Laws of China: ఈ పనులు భారత్‌లో అడ్డూఅదుపూ లేకుండా చేశాం కదా అని చైనాలో కూడా చేయానుకుంటే ఎలా బుక్కయిపోతారంటే...

ABN , First Publish Date - 2023-03-13T09:16:47+05:30 IST

Laws of China: చైనా ఎప్పడూ ఏదోఒక విషయమై ముఖ్యాంశాలలో(headlines) నిలుస్తుంటుంది. ముఖ్యంగా అక్కడి జీవనశైలి ప్రధానాంశాలలో భాగమవుతుంటుంది.

Laws of China: ఈ పనులు భారత్‌లో అడ్డూఅదుపూ లేకుండా చేశాం కదా అని చైనాలో కూడా చేయానుకుంటే ఎలా బుక్కయిపోతారంటే...

Laws of China: చైనా ఎప్పడూ ఏదోఒక విషయమై ముఖ్యాంశాలలో(headlines) నిలుస్తుంటుంది. ముఖ్యంగా అక్కడి జీవనశైలి ప్రధానాంశాలలో భాగమవుతుంటుంది. ఈ దేశంలోని విచిత్రమైన నిబంధనల(Regulations) కారణంగా ప్రజల జీవన విధానం మారిపోతుంటుంది. చైనాలో అనేక విచిత్రమైన చట్టాలు ఉన్నాయి. అక్కడి ప్రజలు భారతదేశం(India)లోని ప్రజల మాదిరిగా స్వేచ్ఛగా తమ జీవితాన్ని గడపలేరు. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చైనాలోని ఇటువంటి వింత చట్టాల(Strange laws) గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తద్వారా మీరు ఎప్పుడైనా చైనాకు వెళితే మీకు ఎటువంటి సమస్యల్లోనూ చిక్కుకోరు. చైనాలో ఏదైనా కల్తీ(forgery)కి పాల్పడితే జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. 3 నుండి 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష, జరిమానా కూడా విధిస్తారు. భారతదేశం(India)లో ఇటువంటి కఠిన నిబంధన లేదు. చైనా సైన్యానికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకుంటే అటువంటివారిపై పరువు నష్టం కేసు(Defamation case) పెట్టే అవకాశం ఉంది. భారతదేశంలో ఎవరికైనా సరే మత స్వేచ్ఛ ఉంది. కానీ చైనాలో మతపరమైన స్వేచ్ఛ లేదు.

గత కొన్నేళ్లుగా ముస్లిం పురుషులు గడ్డం పెంచడంపై నిషేధం విధించారు. చైనాలో గడ్డం ఉంచుకుున్నందుకు చాలా మంది జైలు(prison) పాలయ్యారు. ఇస్లాం స్వేచ్ఛపై చైనాపై నిరంతరం ఓ కన్నేసి ఉంచుతుంది. భారతదేశంలో ఎవరైనా నీటిలో మునిగిపోతుంటే(drowning) వారికి సహాయం చేయడానికి ఇతరులు పరిగెత్తి వెళతారు. కానీ చైనాలో అటువంటి సహాయం చేయకూడదు. దీనికి సంబంధించి చైనాలో ఒక చట్టం(Law) ఉంది. మునిగిపోతున్న వ్యక్తిని అందుకు నియమితులైన వ్యక్తులు మాత్రమే రక్షించగలుగుతారు.

Updated Date - 2023-03-13T10:54:40+05:30 IST