Earth Day 2023: ఏప్రిల్ 22 ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా చరిత్ర, లక్ష్యం, ప్రాముఖ్యత

ABN , First Publish Date - 2023-04-22T18:31:59+05:30 IST

ప్రతి యేటా ధరిత్రి దినోత్సవం(Earth Day) ఏప్రిల్ 22 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడమే ..

Earth Day 2023: ఏప్రిల్ 22 ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా చరిత్ర, లక్ష్యం, ప్రాముఖ్యత

ప్రతి యేటా ధరిత్రి దినోత్సవం(Earth Day) ఏప్రిల్ 22 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడమే దీని ముఖ్యోద్దేశం. ఈ రోజును అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే(International Mother Earth Day) అని కూడా అంటారు. పర్యావరణానికి హాని కలిగించే, గ్రహం నాశనానికి దారితీసే కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్, అటవీ నిర్మూలన వంటి సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఈ రోజున వివిధ అవగాహన కార్యక్రమాలు చేపడతారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం గురించి అవగాహన నిర్వహిస్తారు.

ఎర్త్ డే 2023 థీమ్(Earth Day 2023 Theme)

ప్రపంచ ఎర్త్ డే 2023 యొక్క థీమ్ "మన ప్లానెట్‌లో పెట్టుబడి పెట్టండి". స్థిరమైన అధ్యయనాలవైపు వ్యాపారాలు మారాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం వాతావరణం పరిరక్షణకు రాజకీయంగా, వ్యాపారపరంగా తీసుకోవాల్సిన చర్యను బలోపేతం చేయనుందని, "మన ఆరోగ్యాన్ని, మన కుటుంబాలను, అదేవిధంగా జీవనోపాధిని కాపాడుకునేందుకు ఇది సరియైన సమయం అని ఎర్త్‌డే సంస్థ పేర్కొంది.

ఎర్త్ డే 2023 చరిత్ర(History)

అమెరికాలో సెనేటర్ గేలార్డ్ నెల్సన్(Senator Gaylord Nelson) 1970లో మొదటిసారి ఎర్త్ డేని నిర్వహించారు. కాలిఫోర్నియాలోని శాంటా బార్బరా చమురు చిందిన ఘటన తర్వాత అమెరికన్ పౌరులు చేపట్టిన ఉద్యమ విజయానికి సూచకంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పర్యావరణ శాస్త్రాన్ని ప్రోత్సహించాలని, పర్యావరణానికి సంబంధించిన సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలని నిర్ణయించారు. 1969 ప్రారంభంలో కాలిఫోర్నియా(California)లోని శాంటా బార్బరా(Santa Barbara)లో చమురు చిందిన భయానక ఘటన చూసిన తర్వాత గెలార్డ్ నెల్సన్ ఆందోళన చెందాడు.

ఏప్రిల్ 22, 1970న, నీటి కాలుష్యం, చమురు చిందటం, అడవి మంటలు, వాయు కాలుష్యం మొదలైన పర్యావరణ సంక్షోభానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. 20 మిలియన్ల అమెరికన్ పౌరులు నగరం అంతటా వీధుల్లోకి వచ్చారు. ఆ వీధి నిరసన భారీ సంచలనం సృష్టించింది. దావానలంలా వ్యాపించిన ఈ ఉద్యమం వందలాది నగరాలు క్రమంగా ఉద్యమబాట పట్టాయి. ప్రపంచంలోని అతిపెద్ద నిరసనలలో ఒకటిగా ఈ ఉద్యమం నిలిచింది. మొదటి ప్రపంచ దినోత్సవ ఉద్యమం నుంచి ప్రస్తుత ప్రపంచ దినోత్సవం 2022 వేడుక వరకు ఇదే అతిపెద్ద ఉద్యమం.

ప్రస్తుతం సెమినార్లు, ఈవెంట్‌లు వంటి పలు అవగాహన కల్పించడానికి ఎర్త్ డే నిర్వహిస్తున్నాం. ఇటువంటి ఆధునిక పర్యావరణ ఉద్యమాలు మెరుగైన జీవనం కోసం గ్రహాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని ప్రపంచానికి తెలియజేస్తాయి.

ఎర్త్ డే 2023 ప్రాముఖ్యత

ప్రస్తుత రోజుల్లో అనేక సభలు, సమావేశాలు, సెమినార్లు నిర్వహించడం ద్వారా పర్యావరణం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రపంచం దృష్టి సారించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. ఈ ఆధునిక పర్యావరణ ఉద్యమాలు మెరుగైన జీవనం కోసం గ్రహాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని ప్రపంచం గ్రహించడంలో సహాయపడతాయి.

Updated Date - 2023-04-22T18:33:16+05:30 IST