Naga Chaitanya: ఆ రోజున ‘కస్డడీ’లోకి తీసుకుంటాం

ABN , First Publish Date - 2023-02-25T12:03:59+05:30 IST

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ‘కస్టడీ’ చిత్రం విడుదల ఖరారైంది. వెంకట ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. మే 12న సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది.

Naga Chaitanya: ఆ రోజున ‘కస్డడీ’లోకి తీసుకుంటాం

అక్కినేని నాగ చైతన్య (Akkineni naga chaitanya) హీరోగా నటిస్తున్న ‘కస్టడీ’ చిత్రం విడుదల ఖరారైంది. వెంకట ప్రభు (Venkat prabhu)దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. మే 12న సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. కృతీశెట్టి (Krithi shetty) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్‌ స్ర్కీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి (Srinivasaa chitturi) ప్రతిష్ట్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శుక్రవారంలో ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. దర్శకుడు వెంకట్‌ ప్రభు కట్‌ చెప్పి.. ‘’చైతు మా కస్టడీ నుంచి ఇక నీకు విడుదల’ అని చెప్పగా.. ‘మీ అందరినీ మే 12న కస్టడీలోకి తీసుకుంటాం. థియేటర్‌ లో కలుద్దాం’’ అని నాగచైతన్య, కృతి శెట్టి చెప్పడం ప్రేక్షకుల్ని అలరిస్తుంది. (Custody Movie releasing on 12 may)

"నాగ చైతన్య కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో కస్టడీ ఒకటి. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రం రూపొందుతోంది. మాస్ర్టో ఇళయరాజా, యువన్‌ శంకర్‌ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.. అబ్బూరి రవి మాటలు, ఎస్‌ఆర్‌ కత్తిర్‌ సినిమాటోగ్రఫీ సినిమాకు ఆకర్షణగా నిలుస్తాయి’’ అని నిర్మాత చెప్పారు. ఈ ఈ చిత్రంలో అరవింద్‌ స్వామి విలన్‌గా, ప్రియమణి ఓ పవర్‌పుల్‌ పాత్రలో కనిపించనున్నారు. (Custody)

Updated Date - 2023-02-25T12:04:00+05:30 IST