Viral Video: పిల్లలు కాదండోయ్.. పిడుగులు.. నిండా పదేళ్ల వయసు కూడా ఉండదు కానీ.. వీళ్ల వీడియోను చూస్తే నివ్వెరపోవడం ఖాయం..!

ABN , First Publish Date - 2023-05-15T13:25:30+05:30 IST

ప్రస్తుత తరం కుర్రాళ్లు వెరీ స్మార్ట్. చిన్న వయసులోనే అన్ని విషయాల గురించి తెలుసుకుని తమ ట్యాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారు. పిల్లలకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో అప్‌లోడ్ అవుతున్నాయి.

Viral Video: పిల్లలు కాదండోయ్.. పిడుగులు.. నిండా పదేళ్ల వయసు కూడా ఉండదు కానీ.. వీళ్ల వీడియోను చూస్తే నివ్వెరపోవడం ఖాయం..!

ప్రస్తుత తరం కుర్రాళ్లు వెరీ స్మార్ట్. చిన్న వయసులోనే అన్ని విషయాల గురించి తెలుసుకుని తమ ట్యాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారు. పిల్లలకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో అప్‌లోడ్ అవుతున్నాయి. ఆ వీడియోల్లో కొందరు పిల్లల ట్యాలెంట్ చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు పిల్లలు అద్భుతంగా డ్యాన్స్ చేశారు (Children Dancing Videos).

@everythingaboutnepal అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. నేపాల్‌లో (Nepal) ఈ వీడియోను చిత్రీకరించినట్టు సమాచారం. ఓ పెళ్లి ఊరేగింపులో బ్యాండ్ ముందు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి డ్యాన్స్ చేశారు. పాటకు అనుగుణంగా చాలా చక్కగా, లయబద్ధంగా డ్యాన్స్ చేశారు. నేపాలీ జానపథ గీతం ``పంచే బాజా``కు ఇద్దరూ డ్యాన్స్ వేశారు. వారి డ్యాన్స్‌ను చూస్తూ చుట్టు పక్కల వారు బాగా ఎంకరేజ్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Viral Video: ఏనుగు వెనుక కాళ్లు ఎంత బలమైనవో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో!

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు ఆ పిల్లల డ్యాన్స్‌ను మెచ్చుకుంటున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన రెండ్రోజుల్లోనే 16 వేల లైక్‌లు సాధించింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Updated Date - 2023-05-15T13:25:30+05:30 IST