Chandra Babu Vijayasai Reddy: కష్ట కాలంలో కలిసిన చంద్రబాబు, విజయసాయి ఏం మాట్లాడుకున్నారంటే..

ABN , First Publish Date - 2023-02-19T13:35:05+05:30 IST

గుండెపోటు కారణంగా తుది శ్వాస విడిచిన తారకరత్న నివాసంలో అరుదైన దృశ్యం కనిపించింది. తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించేందుకు చంద్రబాబు వెళ్లిన సమయంలో..

Chandra Babu Vijayasai Reddy: కష్ట కాలంలో కలిసిన చంద్రబాబు, విజయసాయి ఏం మాట్లాడుకున్నారంటే..

గుండెపోటు కారణంగా తుది శ్వాస విడిచిన తారకరత్న నివాసంలో (TarakaRatna House) అరుదైన దృశ్యం కనిపించింది. తారకరత్న భౌతికకాయానికి (RIP TarakaRatna) నివాళులర్పించేందుకు చంద్రబాబు (Chandra Babu) వెళ్లిన సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) అక్కడే ఉన్నారు. తారకరత్నకు నివాళులర్పించిన అనంతరం విజయసాయిరెడ్డి, చంద్రబాబు (Vijayasai ChandraBabu) కొద్దిసేపు మాట్లాడుకున్నారు. రాజకీయం విషయానికొస్తే ఈ ఇద్దరూ భిన్న ధృవాలు. చంద్రబాబు ప్రత్యర్థి అయిన జగన్‌కు విజయ సాయి అత్యంత ఆప్తుడు. జగన్ అనునిత్యం ద్వేషించే వ్యక్తి చంద్రబాబు. విజయసాయిరెడ్డి కూడా పలు సందర్భాల్లో చంద్రబాబు, లోకేష్‌పై తీవ్ర విమర్శలు చేసిన వ్యక్తే. కానీ.. రాజకీయ వైరుధ్యాలను పక్కనపెడితే నందమూరి కుటుంబానికి వచ్చిన కష్టం ఈ ఇద్దరినీ కలిపింది. విజయసాయిరెడ్డికి, తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి తండ్రీకూతురు లాంటి అనుబంధం ఉంది. తారకరత్న, చంద్రబాబు బంధుత్వం గురించి అందరికీ తెలిసిందే. ఇలా ఈ బంధుత్వమే రాజకీయంగా బద్ధ శత్రువుల్లాంటి చంద్రబాబు, విజయసాయి రెడ్డిని పక్కపక్కనే కూర్చుని మాట్లాడేలా చేసింది. ఈ ఇద్దరూ కలిసి ఏం మాట్లాడుకుని ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

cbn-vs.jpg

కష్ట కాలంలో కలిసిన ఈ ఇద్దరూ ఈ కష్టం నుంచి తారకరత్న కుటుంబాన్ని ఎలా బయటపడేయాలనే విషయంపై మాట్లాడుకున్నారు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి, కుమార్తె నిషికా రెడ్డికి కష్టం దరి చేరకుండా.. తారకరత్న లేని లోటును తెలియకుండా చూసుకోవడానికి ఏం చేయాలన్న విషయంపై చంద్రబాబు, విజయసాయి రెడ్డి చర్చించినట్లు తెలిసింది. నందమూరి కుటుంబానికి వచ్చిన ఈ కష్టం గురించి మాట్లాడుకున్న ఈ ఇద్దరూ ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నంతసేపు విజయసాయిరెడ్డి పక్కనే ఉన్నారు. విజయసాయి చంద్రబాబుతో మాత్రమే కాదు ఉదయం తారకరత్నకు నివాళులర్పించడానికి వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌తో కూడా మాట్లాడారు. విజయసాయిరెడ్డి ఉదయం నుంచి తారకరత్న స్వగృహంలోనే ఉన్నారు. తారకరత్న భౌతికకాయాన్ని చూస్తూ తల్లడిల్లిపోతున్న అతని భార్యాబిడ్డకు ఓదార్చారు.

vs-cbn.jpg

తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి.. విజయసాయిరెడ్డికి కూతురు వరుస అవుతుంది. విజయసాయిరెడ్డి భార్య చెల్లెలి కుమార్తె అయిన అలేఖ్యా రెడ్డిని తారకరత్న వివాహం చేసుకున్నారు. ఈ బంధుత్వం ఉండటంతో తారకరత్న ఆసుపత్రిలో ఉన్న సమయంలో కూడా విజయసాయి రెడ్డి బెంగళూరు హృదయాలయకు వెళ్లి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. తారకరత్న భార్య కుటుంబానికి టీడీపీ పుంగనూరు ఇన్‌ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి కుటుంబంతో కూడా బంధుత్వం ఉంది. తారకరత్న వివాహం చేసుకున్న అలేఖ్యా రెడ్డి (TarakaRatna Wife Alekhya Reddy) మరెవరో కాదు చల్లా రామచంద్రారెడ్డి పెద్దమ్మ కుమార్తెనే కావడం గమనార్హం.

cbn-vs1.jpg

నందమూరి తారకరత్న అకాల మరణం తెలుగు రాష్ట్రాల్లోని మెజార్టీ ప్రజలను కలచివేసింది. వివాద రహితుడైన ఈ ఎన్టీఆర్ మనవడికి రాజకీయ పార్టీలకు అతీతంగా సంతాపం వ్యక్తమవుతోంది. వైసీపీ అధినేత జగన్‌తో పాటు ఆ పార్టీకి చెందిన చాలామంది సోషల్ మీడియాలో తారకరత్న మృతి పట్ల సంతాపం వ్యక్తం చేయడం గమనార్హం. ‘పవన్ బాబాయ్ అని పిలుస్తుంటానని’ ఒక ఇంటర్వ్యూలో తారకరత్న చెప్పిన వీడియోను పోస్ట్ చేస్తూ పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు తారకరత్నకు నివాళి తెలిపారు. రాజకీయ పార్టీలకు అతీతంగా తారకరత్నకు నివాళి తెలుపుతున్నారంటే ఆయన ఎంత గొప్పగా జీవించారో చెప్పనక్కర్లేదు.

Updated Date - 2023-02-19T13:35:16+05:30 IST